నిన్న జయలలిత... ఇప్పుడు శ్రీదేవి

Updated:10/03/2018 05:21 AM

yesterday jayalalitha..now sridevi

జ‌య‌ల‌లిత‌.. శ్రీదేవి ఇద్ద‌రూ వెండితెర‌పై మ‌హారాణులుగా వెలిగిన తార‌లు. మందీమార్బ‌లం.. కోట్లాదిరూపాయ‌ల సంప‌ద‌.. అభిమాన‌గ‌ణం.. ఇంత‌మంది వున్నా.. ఒంట‌రిగానే జీవించారు. ఒక‌రు పెళ్లిగాకుండా.. మ‌రొక‌రు పెళ్లయి.. భ‌ర్త పిల్ల‌లున్న ఒంట‌రిగా జీవితం గ‌డిపారు. బ‌య‌టి ప్ర‌పంచానికి బంగారు పంజ‌రంలో చిక్కిన చిలుక‌ల్లా జీవ‌నం సాగించారు. సీఎం హోదాలో వున్న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత దాదాపు 75 రోజులపాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందారు. అమ్మ కోలుకున్నారు.. నేడో రేపో.. బ‌య‌ట‌కు వ‌చ్చి అభిమానుల‌కు అభివాదం చేస్తారంటూ చెబుతూ పొద్దు గ‌డిపారు చివ‌ర్లో.. అమ్మ ఇక లేరంటూ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. అపోలో ఆసుప‌త్రిలో అన్ని రోజుల పాటు వైద్యం అందించిన వైద్యులు.. లండ‌న్ నుంచి ర‌ప్పించి ప్ర‌ఖ్యాత డాక్ట‌ర్లు.. జ‌య మ‌ర‌ణానికి కార‌ణాల‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి చెప్ప‌లేక‌పోయారు. అనంత‌ర ప‌రిణామాల్లో జ‌య చెలిక‌త్తె.. నేస్తం.. శ‌శిక‌ళ జైలుకు వెళ్ల‌టం క్ర‌మంగా జ‌రిగిపోయాయి. చిన్న‌మ్మే.. దీనంత‌టికీ కార‌ణ‌మ‌నే అప‌వాదును మాత్రం మూట‌గ‌ట్టుకుంది. ఏళ్లు గ‌డు.. న్యాయ‌స్థానాల్లో పిటీష‌న్లు దాఖ‌లైనా.. జ‌య మ‌ర‌ణం.. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ.. ప్ర‌శ్న‌గా మిగిలిపోయేదే. ఇప్పుడు శ్రీదేవి ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతున్న ఆమె ముంబై నుంచి దుబాయ్ చేరి.. నీటితొట్టెలో ప్రాణాలు కోల్పోయింది. భార్య‌ను దుబాయ్‌లో వ‌దిలొచ్చిన బోనీక‌పూర్‌.. శ్రీదేవి ష‌డ‌న్ డిన్న‌ర్ ఇప్పించి.. థ్రిల్ ఇవ్వాల‌ని రాత్రికి రాత్రే.. ఫ్ల‌యిట్ ఎక్కి దుబాయ్ చెక్కేశాడు. న‌వ్వుతూ మాట్లాడిన భార్య‌.. బాత్‌రూమ్ కు వెళ్లి పావుగంట దాటినా రాక‌పోవ‌టంతో స్నేహితుడి సాయంతో లోప‌ల‌కు వెళ్లార‌ట‌. అప్ప‌టికే ట‌బ్‌లో నిర్జీవంగా ప‌డిపోయిన భార్య‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారట. పైగా.. క‌పూర్ బంధుగ‌ణంలో ఒక‌రు మీడియాకు స‌మాచారం ఇచ్చారు. శ్రీదేవి గుండెపోటుతో మ‌ర‌ణించారంటూ దాని సారాంశం. తెల్లారే.. డాక్ట‌ర్లు.. తూచ్‌.. ఇదంతా ఒట్టిదే.. నీటిలో మునిగిపోయింది. ర‌క్తంలో మ‌ద్యం తాగిన ఆన‌వాళ్లున్నాయంటూ మ‌రో సంచ‌ల‌నం. అంతే.. మ‌ళ్లీ ద‌ర్యాప్తు మొద‌లు.. చివ‌ర‌కు.. అంతా సుగుమం.. ప్ర‌మాద‌వ‌శాత్తూ నీటిలోప‌డి మ‌ర‌ణించిన శ్రీదేవి అంటూ ద‌ర్యాప్తు ముగించారు. మీడియా అనుమానాల‌ను.. ప్ర‌చార ఆర్భాటాలుగా కొట్టిపారేస్తూ.. ఉత్కంఠ‌త‌ను అభిమానుల‌కు వ‌దిలేశారు.

సంబంధిత వార్తలు

మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి!

మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి!

కోమటిరెడ్డి, సంపత్‌కు హైకోర్టులో వూరట

కోమటిరెడ్డి, సంపత్‌కు హైకోర్టులో వూరట

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించా: కేసీఆర్‌

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చించా: కేసీఆర్‌

బాబును మళ్లీ ఏకేసిన పవన్, లోకేష్ అవినీతిపై ఆధారాలున్నాయ్!

బాబును మళ్లీ ఏకేసిన పవన్, లోకేష్ అవినీతిపై ఆధారాలున్నాయ్!

సామాన్య కార్యకర్తలకు పెద్దపీట కాంగ్రెస్‌ ప్లీనరీలో మధుయాస్కీగౌడ్‌

సామాన్య కార్యకర్తలకు పెద్దపీట కాంగ్రెస్‌ ప్లీనరీలో మధుయాస్కీగౌడ్‌

విశాల్ సూపర్..  తమిళ రాకర్స్ సభ్యులు అరెస్ట్

విశాల్ సూపర్.. తమిళ రాకర్స్ సభ్యులు అరెస్ట్

రంగస్థలం అమ్మా, నాన్న గర్వపడే సినిమా... ప్రీరిలీజ్‌లో రాంచరణ్

రంగస్థలం అమ్మా, నాన్న గర్వపడే సినిమా... ప్రీరిలీజ్‌లో రాంచరణ్

ఉగాది పచ్చడి ఇలా చేస్తేనే ఐశ్వర్యం..!

ఉగాది పచ్చడి ఇలా చేస్తేనే ఐశ్వర్యం..!

Latest Videos

You Tube Image

నటి భానుప్రియ ఇంట విషాదం | Heroine BhanuPriya Husband Passed Away | Adabhyderabad News