ఈ నెల 20న విడుదల కానున్న షియోమీ గేమింగ్ స్మార్ట్‌ఫోన్

Updated:15/04/2018 05:22 AM

xiaomi smart shark phone releasing on april 20th

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన గేమింగ్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ షార్క్‌ను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనుంది. మొదట ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది. తరువాత భారత మార్కెట్‌లోనూ విడుదల కానుంది. 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానున్న ఈ ఫోన్ వరుసగా రూ.31,160, రూ.36,375 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.

ఈ ఫోన్‌లో 5.99 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌లను అమర్చారు. అలాగే వెనుక భాగంలో 12, 20 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేయగా, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫోన్ దిగువన స్లైడ‌ర్ రూపంలో ప్ర‌త్యేకంగా గేమింగ్ ప్యాడ్‌ను అమ‌ర్చారు. దీంతో గేమ్స్ సుల‌భంగా ఆడుకోవ‌చ్చు.

షియోమీ బ్లాక్ షార్క్ ఫీచర్లు...
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

 

సంబంధిత వార్తలు

జియోకు పోటీగా రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

జియోకు పోటీగా రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

వన్ ప్లస్ 6 లుక్ అదిరిపోయింది

వన్ ప్లస్ 6 లుక్ అదిరిపోయింది

యూట్యూబ్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..

యూట్యూబ్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..

మోటోరోలా నుంచి మోటో జడ్3 ప్లే స్మార్ట్‌ఫోన్

మోటోరోలా నుంచి మోటో జడ్3 ప్లే స్మార్ట్‌ఫోన్

హువావే నుంచి వై3 2018 స్మార్ట్‌ఫోన్

హువావే నుంచి వై3 2018 స్మార్ట్‌ఫోన్

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

రెండు నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్

రెండు నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్

వాట్సాప్‌లో మెసేజ్ బాంబులు.. ఓపెన్ చేస్తే అంతే సంగతులు.

వాట్సాప్‌లో మెసేజ్ బాంబులు.. ఓపెన్ చేస్తే అంతే సంగతులు.

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR