గాలిలో ప్రాణాలు... పనిచేయని పరికరాలు.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి వరంగల్ ఎంజిఎం పై ప్రత్యేక కథనం..

Updated:19/11/2017 12:00 AM

warangal mgm hospital  news updates

ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే భయం. ఆ భయం ఇంకా కొన్ని ఆసుపత్రులలో వెంటాడుతూనే ఉంది. పనిచేయని వైద్య పరికరాలు, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పే వైద్యులు, అమ్యామ్యాలకు అలవాటుపడ్డ సిబ్బంది అన్ని కలిసి ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మరీ అధ్వాన్నంగా తయారయ్యింది.
 ఉత్తర తెలంగాణలో పెద్దాసుపత్రిగా పేరుగాంచినది ఓరుగల్లులోని మహత్మాగాందీ ఆసుపత్రి.. వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుండి నిత్యం ఎంతోమంది వస్తూ ఉంటారు. అక్కడ వైద్యం మాట దేవుడెరుగు కనీస పరికరాల లేక ప్రాణాలు కొల్పొతున్నవారే ఎక్కువమంది. మా దగ్గర ఉన్న పరికరాల పనితీరునే ఇంత మేము ఇంతకన్నా ఏమి చెయ్యలేమని చెపుతూ డాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యమో, డాక్టర్ల పనితీరు లోపమో తెలియదు కాని అన్ని వెరసి శనివారం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. 
     వరంగల్ జిల్లా నర్మెట్ట మండలానికి చెందిన కొన్నె లక్ష్మయ్య పెరాలసిస్ వ్యాధితో శనివారం ఉదయమే ఐఎమ్ సి వార్డులో జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వగానే అతనికి ఎక్స్ రే తీసి అదే వార్డులో ఒక బెడ్ కేటాయించారు. డ్యూటీ డాక్టర్ చూసి వెళ్లగానే ఆ పేషేంట్ కు గుండెపోటు వచ్చింది. అత్యవసర సమయం కాబట్టి ఆ పెషేంట్ కు వెంటిలేటర్ అవసరం ఉంది. డాక్టర్లు కూడా వెంటిలేటర్ల మీద పెట్టాలి లేకుంటే కష్టమని చెప్పారని పెషేంట్ బంధువులు చెప్పారు. కాని అక్కడ వెంటిలేటర్లు ఉన్నవే పది అంట. అందులో రెండు, మూడు పనిచేయ్యట్లేవంట. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి వచ్చే పరిస్థితి ఆగమ్యగోచరమంట. వెంటిలేటరు లేక శనివారం ఉదయం ఆడ్మిట్ ఆయన లక్ష్మయ్య సాయంత్రం వరకు చనిపోయారు. ఇతని ప్రాణానికి ఎవరు బాధ్యత వహిస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఉత్తర తెలంగాణలోనే పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన ఆస్పత్రిలో వెంటిలేటర్ల సౌకర్యం లేదంటే ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. ప్రభుత్వం ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయంటే ఇక్కడకు వచ్చామని, తీరా వచ్చాక నిండు ప్రాణం బలైపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మాటలతో మేడలు కట్టే నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన కారణంగా బలైపోయిన లక్ష్మయ్య కుటుంబానికి ఏమని చెపుతారో, ఇంకెంతమందిని బలితీసుకుంటారో తెలియట్లేదు. ప్రభుత్వ ఆస్పత్రులు అంటే అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్గించాలని రోగులు కోరుతున్నారు

సంబంధిత వార్తలు

రోజూ ఒక గ్లాస్ దానిమ్మ రసం తాగితే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా..?

రోజూ ఒక గ్లాస్ దానిమ్మ రసం తాగితే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా..?

కంటి స‌మ‌స్య‌ల‌కు ఎఫెక్టివ్ టిప్స్‌.

కంటి స‌మ‌స్య‌ల‌కు ఎఫెక్టివ్ టిప్స్‌.

మ‌ధుమేహం ఉన్న వారు మామిడిపండ్ల‌ను తిన‌వ‌చ్చా

మ‌ధుమేహం ఉన్న వారు మామిడిపండ్ల‌ను తిన‌వ‌చ్చా

భోజ‌నం చేశాక సోంపు తింటే ఎన్నో లాభాలు

భోజ‌నం చేశాక సోంపు తింటే ఎన్నో లాభాలు

వడదెబ్బ నుంచి త‌ప్పించుకోండిలా..

వడదెబ్బ నుంచి త‌ప్పించుకోండిలా..

రాగి అంబ‌లి వేస‌వి తాపానికి మంచి ఉప‌శ‌మ‌నం

రాగి అంబ‌లి వేస‌వి తాపానికి మంచి ఉప‌శ‌మ‌నం

అనారోగ్య స‌మ‌స్య‌ల ప‌ని ప‌ట్టే తేనె, ఉసిరి మిశ్ర‌మం..!

అనారోగ్య స‌మ‌స్య‌ల ప‌ని ప‌ట్టే తేనె, ఉసిరి మిశ్ర‌మం..!

చర్మంపై నల్లమచ్చలు పోవాలంటే..

చర్మంపై నల్లమచ్చలు పోవాలంటే..

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR