వీ.ఆర్.ఓ. సమస్యలపై నజర్..

వీ.ఆర్.ఓ. సమస్యలపై నజర్..

 

- వీఆర్వోల అంశంపై ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష
- 5 వేల 14 మంది కొత్త పోస్టుల్లో చేరినట్లు సమాచారం
- కొత్త పోస్టుల్లో రిపోర్టు చేయని వారిపై చర్యలు తీసుకునే ఛాన్స్

హైదరాబాద్, 04 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :
వీఆర్వోల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న 5వేల 137 మందిలో.. ఇప్పటి వరకు 5వేల 14 మంది కొత్త పోస్టుల్లో చేరినట్లు తెలుస్తోంది. 19 మంది విషయంలో మాత్రం యథాస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా.. ఆ 19 మందిలోనూ 15 మంది కొత్త పోస్టుల్లో చేరినట్లు సమాచారం. అయితే.. వీఆర్వోలను ఎట్టి పరిస్థితుల్లోనూ రెవెన్యూశాఖలో కొనసాగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కొత్త పోస్టుల్లో రిపోర్టు చేయని వారిపై చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. కొత్త పోస్టుల్లో రిపోర్ట్ చేయని వీఆర్వోల్లో ఎవరైనా.. స్వచ్చంద పదవీ విరమణ కోరుకుంటే.. నిబంధనలతో కూడిన అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న వీఆర్వోలకు ప్రభుత్వం విధులు అప్పగించింది. ఇన్నాళ్లు రెవెన్యూ శాఖలో పని చేసిన వారిని వేర్వేరు శాఖల్లో సర్దుబాటు చేసింది. గ్రామ రెవెన్యూ అధికారుల సర్దుబాటుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అనుసరించి ఉమ్మడి జిల్లాలో లక్కీ డ్రా నిర్వహించి ప్రక్రియను పూర్తి చేశారు.

Tags :