దుర్గాబాయ్‌లో వొకేషనల్ కోర్సులు

Updated:12/05/2018 09:49 AM

vocational training in durgabai deshmukh

దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్)లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ వొకేషనల్ కోర్సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వొకేషనల్ కోర్సులకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసీ అసిస్టెంట్, డయాలసిస్ అసిస్టెంట్, బెడ్‌సైడ్ అసిస్టెంట్, హెల్త్‌కేర్ మల్టీపర్పస్ వర్కర్, లీగల్ అసిస్టెంట్, ప్రి ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ తదితర విభాగాల్లో షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటించారు. కనీసం పదవ తరగతి పాసై పద్దెనిమిదేళ్లు పూర్తైన వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని చెప్పారు. ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన వారికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌కు చెందిన స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ తరఫున సర్టిఫికెట్ అందజేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ఇతర వివరాలకు 9397824542 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.