శ్రీదేవి కూతురు నటించిన ధడక్ సినిమా వీడియో లీక్‌

Updated:13/03/2018 12:24 PM

video leak of dhadak movie

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తొలిసారిగా నటిస్తున్న చిత్రం ధడక్‌. మరాఠీలో సంచలనం సృష్టించిన సైరాట్‌ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో జాన్వీ క్యారెక్టర్‌, లుక్స్‌ కు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి.