కుల పత్రాల జారీకి ఆదేశించాలని ఉప రాష్ట్ర పతికి వినతి..

కుల పత్రాల జారీకి ఆదేశించాలని ఉప రాష్ట్ర పతికి వినతి..


- ఆగని మదారి కురువ మదాసి కురువ కుల పత్ర పోరాటం 
- ఈ విషయం తన దృష్టిలో ఉందని సానుకూలంగా స్పందించిన ఉప రాష్ట్రపతి..  
- ఉప రాష్ట్రపతికి ప్రత్యేక కృతజ్ఞలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు సత్యస్వరూప్..


మదారి కురువ మదాసి కురువలకు కుల పత్రాల జారీకి ఆదేశించాలని భారత ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడుకి వినతిపత్రం అందజేసిన డాక్టర్ మురహరి బుద్దారం
 
హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో మదారి కురువ / మాదాసి కురువలకు ఎస్సీ ఉపకులం సీరియల్ నెంబర్ 30 లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో 31 సీరియల్ నెంబర్ లో గల కుల దృవీకరణ పత్రాలు జారీ చేయకుండా ఇబ్బందులకు గురిచేయుచున్న అధికారులకు, ప్రభుత్వాలకు తగు ఆదేశాలు జారీ చేయగలరని కోరుతూ కుల సంఘం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సమన్వయ కర్త డాక్టర్ మురహరి బుద్దారం వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  మేము తెలంగాణ రాష్ట్ర మాదారి కురువ / మాదాసి కురువ కులస్థులము. మా యొక్క పూర్వీకులు మా కులవృత్తి ఐన గొర్రెల కాపరులుగా, సంచార జాతులుగా ఉన్నారు. వీరంతా  ఊరికి దూరంగా కుటుంబానికి, సమాజానికి దూరంగా ఎక్కువ కాలం అడవిలో ఉంటూ చదువుకు నోచుకోక, గొర్రెలు కాస్తూ జీవించటం జరిగింది. అయితే ఇప్పుడు మమ్ములను సాధారణంగా  “కురువ” అనే పేరుతో పిలుస్తారు. మా పూర్తి కులం మాదారి కురువ / మాదాసి కురువకు బదులుగా కురువ అని పిలవబడే పదం ఒక అసంపూర్తి పదం మాత్రమే. కావున ప్రభుత్వ గజెట్లలో కూడా “కురువ” అనే కులము ఏ ఇతర వెనుకబడిన తరగతుల కులాలలో కూడా లేదు. కావున ఈ మా కులము మాదారి కురువ / మాదాసి కురువ లో అంతర్లీనమై ఉన్నదని స్పష్టం చేయుచున్నాయి. 
 
అలాగే ఇదే అంశమై జాతీయ ఎస్సీ కమీషన్ తగుసిఫార్సు చేస్తూ లెటర్ నెంబర్. డీ-3/తెలంగాణ - 1/2016/ఎస్.ఎస్.డబ్ల్యు=1, తేదీ :04-10-2016. కురువ అనే కులం ఏ ఇతర ఓసీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలలో ఎక్కడ లేదు అని కురువ కులపత్రం ఇచ్చిన వారికి వెంటనే మదారి కురువ/మదాసి కురువ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని పేర్కొనటం జరిగిందని, అయితే జాతీయ ఎస్సీ కమీషన్ సిఫార్సుల ఆధారంగా తెలంగాణ తెలంగాణ రాష్ర ప్రభుత్వం మెమో నెంబర్ : 1268/ఎస్.సి.డీ. పీ.ఓ.ఏ. ఏ 2/2016, తేదీ : 30-11-2016, మెమో నెంబర్ :  1268/ఎస్.సి.డీ. పీ.ఓ.ఏ. ఏ2/2016-12, తేదీ : 12-06-2017 ని జారీ చేస్తూ కురువ అనబడే కులం వారికి మదారి కురువ/మదాసి కురువ కులధృవీకరణ పత్రాలు ఇవ్వాలని స్పష్టంగా పేర్కొనటం జరిగిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా మెమో నెంబర్ 1268 ని అమలు చేయడంలో అధికారుల నిరంకుశత్వ ధోరణి వలన అనామకులైన మా మాదారి కురువ/ మాదాసి కురువ (ఎస్సి) వారు ఇప్పటికి కులదృవీకరణ పత్రాలు పొందలేకపోతున్నారని, కుల దృవీకరణ పత్రం కొరకు దరఖాస్తు చేసిన తరువాత కూడా అధికారులు సంవత్సరాల తరబడి నాన్చుతూ ఏకపక్షంగా ఎలాంటి విచారణ లేకుండా, దరఖాస్తు దారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని. కావున దేశ సకల జనుల సంక్షేమం కోరుకొనే ఈ ప్రభుత్వ పాలనలో అధికారులు చేసే ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపల మూలంగా సమాజానికి వీరు ఏం సంకేతాలు పంపుతున్నారనే విషయం అర్ధం కావటం లేదని, అలాగే చట్టాలను అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వలన ఎంతోమంది విద్యార్థుల ఉజ్వల భవిషత్తును కూడా పాడు చేసినట్లు అవుతుందని అన్నారు. అలాగే గతంలోకూడా అధికారులు నిర్లక్ష్యంతో బీసీ జాబితాలో లేని కురువ అనే పేరుతొ తప్పుడు కుల పత్రాలు ఇచ్చిన వారందరికీ మదారి కురువ /మదాసి కురువ ఎస్సీ సీరియల్ నెంబర్ 30 తెలంగాణలో సీరియల్ నెంబర్ 31 ఆంధ్రప్రదేశ్ లో గల కుల పత్రాలను  చట్టప్రకారం మాయొక్క మాదారి కురువ/ మాదాసి కురువ (ఎస్సీ) యొక్క రాజ్యాంగపరమైన హక్కు కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా, మా కులస్తుల జీవితాల జీవన పోరాటం అయిన మా కుల పత్ర సాధన ఆశయాన్ని నెరవేరేలా దేశ ఉప రాష్ట్రపతిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగలరని వెంకయ్య నాయుడుని కోరగా..  ఈ అంశం తన దృష్టిలో ఉందని ఖచ్చితంగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ విధంగా దేశ ఉపరాష్ట్రపతి స్పందించడం నిజంగా చాలా సంతోషం అని రాష్ట్ర అధ్యక్షులు సత్యస్వరూప్ ప్రత్యేక కృతజ్ఞలు తెలిపారు.

Tags :