జూన్‌లో వినోదాలయాత్ర షురూ

Updated:16/04/2018 04:09 AM

venkatesh and varun tej starts rolling from june 2

వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా తెరకెక్కనున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి గత చిత్రాల తరహాలోనే ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమా రూపొందనుంది. కామెడీతో పాటు కుటుంబ అనుబంధాలు, ప్రేమ అంశాల మేళవింపుతో దర్శకుడు చక్కటి కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. జూన్ నెలలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు అనిల్‌రావిపూడి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. చిత్రీకరణ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మల్టీస్టారర్‌లో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

సంబంధిత వార్తలు

మాజీ ల‌వ‌ర్స్ ర్యాంప్ వాక్ అదుర్స్‌

మాజీ ల‌వ‌ర్స్ ర్యాంప్ వాక్ అదుర్స్‌

టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రంగ‌స్థలం

టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రంగ‌స్థలం

మేలో స‌మంత డబుల్ ధ‌మాకా

మేలో స‌మంత డబుల్ ధ‌మాకా

రిస్క్‌లతోనే నా ప్రయాణం!

రిస్క్‌లతోనే నా ప్రయాణం!

ప్రయోగాలు చేసే ఓపిక లేదు!

ప్రయోగాలు చేసే ఓపిక లేదు!

మాధురి దీక్షిత్‌ను పెళ్లి చేసుకుంటా

మాధురి దీక్షిత్‌ను పెళ్లి చేసుకుంటా

హైద‌రాబాద్‌లో అజిత్‌,న‌య‌న‌తార ఆట‌, పాట‌..

హైద‌రాబాద్‌లో అజిత్‌,న‌య‌న‌తార ఆట‌, పాట‌..

నటి ముఖంపై క‌రిచిన కుక్క‌

నటి ముఖంపై క‌రిచిన కుక్క‌

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR