మెగా ఫ్యామిలీ నుండి మ‌రో హీరో..!

Updated:15/04/2018 12:44 PM

vaishnav tej enter into tollywood

చిరంజీవి మొదలు పెట్టిన నట ప్రస్థానంలో ఎందరో మెగా హీరోలు పాలు పంచుకున్నారు. వీరంద‌రు తెలుగు తెరపై సందడి చేస్తోండగా,మరో యంగ్ హీరో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్దమయ్యాడు.ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి చిరు,పవన్ ,బన్నీ,చరణ్ ,సాయిధరమ్ ,వరుణ్ తేజ్ ,అల్లు శిరీష్, క‌ళ్యాణ్ తేజ్‌లు ఎంట్రీ ఇవ్వగా ఇదే ఫ్యామిలీ నుండి మెగా హీరోయిన్‌గా నిహారిక ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో కూడా సినిమాలు చేస్తుంది నిహారిక‌. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి మరో యంగ్ హీరో సందడి చేసేందుకు రెడీ అయ్యాడని తాజా స‌మాచారం.

ఇప్పటికే టాలీవుడ్ లో మెగా హీరోల హవా ఎక్కువగా ఉండగా,వీరు వరుస సక్సెస్ లను సాధిస్తున్నారు.అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో మెగా బాబు రెడీగా ఉన్నట్టు సమాచారం.సినిమా ఫ్యామిలీ కావడంతో ఈ కుర్రాడికి సినిమాలో నటించాలనే ఆసక్తి మరింత పెరిగినట్టు టాక్ .అయితే ఈ కుర్రాడు మరెవరో కాదు వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న సాయిధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ .గతంలో చిరు నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో పేషెంట్ గా నటించిన ఈ కుర్రాడు తన చదువును కొనసాగిస్తూనే మరో వైపు నటన,డ్యాన్స్ ,ఫైట్స్ ఇలా అన్ని కేటగిరీల్లో శిక్షణ పొందుతున్నట్టు తెలుస్తోంది. అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాను, సాయి కొర్రపాటి నిర్మించనున్నారు. కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్‌ని నానుస్తూ వ‌స్తుండ‌గా, తాజాగా ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.సాయి కొర్ర‌పాటి వారాహి బేన‌ర్‌పై చిరంజీవి చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా సినిమాని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

తొలి సినిమా విషయంలో ఇప్పటికే మెగా హీరోల సలహ తీసుకుంటున్న వైష్ణవ్ తేజ్,టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో,ఏ రేంజ్ లో ఇస్తాడో అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

మాజీ ల‌వ‌ర్స్ ర్యాంప్ వాక్ అదుర్స్‌

మాజీ ల‌వ‌ర్స్ ర్యాంప్ వాక్ అదుర్స్‌

టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రంగ‌స్థలం

టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రంగ‌స్థలం

మేలో స‌మంత డబుల్ ధ‌మాకా

మేలో స‌మంత డబుల్ ధ‌మాకా

రిస్క్‌లతోనే నా ప్రయాణం!

రిస్క్‌లతోనే నా ప్రయాణం!

ప్రయోగాలు చేసే ఓపిక లేదు!

ప్రయోగాలు చేసే ఓపిక లేదు!

మాధురి దీక్షిత్‌ను పెళ్లి చేసుకుంటా

మాధురి దీక్షిత్‌ను పెళ్లి చేసుకుంటా

హైద‌రాబాద్‌లో అజిత్‌,న‌య‌న‌తార ఆట‌, పాట‌..

హైద‌రాబాద్‌లో అజిత్‌,న‌య‌న‌తార ఆట‌, పాట‌..

నటి ముఖంపై క‌రిచిన కుక్క‌

నటి ముఖంపై క‌రిచిన కుక్క‌

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR