ప్రభుత్వంపై మండిపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Updated:13/03/2018 12:48 PM

utham kumar reddy serious on government

అసెంబ్లీలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ గతంలో హరీశ్‌రావు వ్యవహరించిన తీరు మరిచిపోయారా? అని నిలదీశారు. సభలో నిన్నటి ఘటన పెద్ద డ్రామా అని విమర్శించారు. కేసీఆర్‌ కనుసన్నల్లో నాటకాలాడుతున్నారని... ప్రధాన ప్రతిపక్షాన్ని అసెంబ్లీ నుంచి గెంటేశారని ఆరోపించారు. కేసీఆర్‌ కూతురు పార్లమెంట్‌లో స్పీకర్‌ ఎదుట ప్లకార్డులు పెడుతున్నారన్నారు. సభలో మార్షల్స్‌తో తమపై దాడి చేయించాని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు