కరెంట్‌షాక్‌తో ఇద్దరు విద్యుత్ సిబ్బంది మృతి

Updated:15/05/2018 02:46 AM

two electricity men died with current shock

కరెంట్‌షాక్‌తో విద్యుత్ సిబ్బంది ఇద్దరు మృతిచెందగా మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కంగ్జి మండలం రాంతిర్త్ గ్రామ శివారులో విద్యుత్ తీగలు అమరుస్తుండగా షాక్‌కు గురై హెచ్. శ్రీను(20) కల్హేర్ మండలం అంతర్గావ్.. దేవకత్ శ్రీను(20) కల్హేర్ మండలం బీబీపేట్ జంలాతండాకు చెందిన ఇద్దరు మృతిచెందారు. అదేవిధంగా మెగావత్ సురేష్(25), దంసింగ్(50), బాబు(22), వినోద్(25) లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం నారాయణఖేడ్‌కు తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.