కారును ఢీకొట్టి ఆగకుండా.. ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. వీడియో

Updated:16/04/2018 03:38 AM

truck drags car for several metres

ఈరోజుల్లో యాక్సిడెంట్లు సాధారణమే. కాని.. అవి జరగడానికి కారణం వాహనదారుల నిర్లక్ష్యం. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో కూడా ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. హైవేపై రైట్ సైడ్ లేన్‌లో వెళ్తున్న ఓ ట్రక్కు... సడెన్‌గా ఎడమ వైపు ఉన్న లేన్‌లోకి మళ్లబోయింది. అయితే.. ఎడమవైపు ఉన్న లేన్‌లో కారు వెళ్తుండటాన్ని ట్రక్కు డ్రైవర్ గమనించకపోవడంతో ట్రక్కు ఆ కారును ఢీకొట్టింది. సరే. ఢీకొట్టిన తర్వాత అయినా ట్రక్కు ఆగాలి. కదా. కాని.. ఆ ట్రక్కు కారును అలాగే రోడ్డు మీద కొంత దూరం ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది.

ఈ ఘటనను ట్రక్కు వెనక వస్తున్న ఓ కారు డ్రైవర్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు.. ఆ యాక్సిడెంట్‌పై తెగ చర్చిస్తున్నారు. కొంతమంది కారు డ్రైవర్‌ది తప్పు అంటే.. మరి కొంత మంది ట్రక్కు డ్రైవర్‌దే తప్పని వాదిస్తున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని గీలాంగ్ రింగ్ రోడ్‌లో చోటు చేసుకున్నది.

 

 

సంబంధిత వార్తలు

మృత్యుంజయుడు.. రాత్రి బావిలో ప‌డి తెల్లారేదాకా అందులోనే!

మృత్యుంజయుడు.. రాత్రి బావిలో ప‌డి తెల్లారేదాకా అందులోనే!

రన్‌వేపై జారిన విమానం

రన్‌వేపై జారిన విమానం

పోలీసుల నుంచి తప్పించుకొని బురదలో చిక్కుకున్నాడు.

పోలీసుల నుంచి తప్పించుకొని బురదలో చిక్కుకున్నాడు.

అపార్ట్‌మెంట్ మధ్యలో రయ్‌మంటూ దూసుకెళ్తున్న ట్రెయిన్..

అపార్ట్‌మెంట్ మధ్యలో రయ్‌మంటూ దూసుకెళ్తున్న ట్రెయిన్..

అత్యాచార ఘటనలపై రాజకీయాలు వద్దు: మోదీ

అత్యాచార ఘటనలపై రాజకీయాలు వద్దు: మోదీ

ఈ అమ్మాయికి ఏకంగా 45 సర్జరీలు..

ఈ అమ్మాయికి ఏకంగా 45 సర్జరీలు..

ప్రేమ, స్నేహం కోసం ఫేస్‌బుక్‌లో

ప్రేమ, స్నేహం కోసం ఫేస్‌బుక్‌లో

ఒక మనిషి.. మూడు ముఖాలు

ఒక మనిషి.. మూడు ముఖాలు

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR