ఎత్తుమడమలు రోజూనా...

Updated:05/04/2018 03:15 AM

todays highheels

ఈ తరం అమ్మాయిలు ఫ్యాషన్‌పై ఎక్కువ శ్రద్ధ చూపించినంతగా వాటిని దీర్ఘకాలం ఉపయోగిస్తే వచ్చే అనర్థాలను గమనించుకోరు. ఇవి కొన్నిసార్లు అనా* ఈ మధ్యకాలంలో శరీరాకృతిపై ఎక్కువ మోజు పెంచుకుంటోంది యువత. దీనివల్ల బాడీషేపర్‌ల వాడకం ఎక్కువైంది. వీటిని తరచూ, దీర్ఘకాలం వాడటం వల్ల కీళ్ల సమస్యలు ఎదురవుతాయి. నరాలపైనా ఒత్తిడి పడుతుంది. వెన్నెముక పనితీరుపైనా తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. నిజానికి శరీరాకృతి కోసం కృత్రిమ ఫలితాలను నమ్ముకోవడం కంటే వ్యాయామం చేయడం ద్వారా నాజూకైన శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు.
* శరీరానికి అతుక్కునేలా దుస్తుల్ని వేసుకుంటేనే శరీరాకృతి చక్కగా కనబడతుందని నమ్ముతారు చాలామంది అమ్మాయిలు. ముఖ్యంగా బిగుతైన ప్యాంట్లూ, స్కర్ట్‌లూ, లెగ్గింగ్‌లు వంటివి వేసుకోవడం వల్ల చర్మం రాపిడికి గురై ఎలర్జీ రావచ్చు. అలానే క్లోజ్డ్‌ ఫిట్టింగ్‌ స్కర్ట్‌లూ, లెగ్గింగ్‌ల వల్ల కండరాల నొప్పులూ, డిస్క్‌ సమస్యలూ ఎదురవుతాయి. వీటిని గమనించాకే మీరు మీ స్టైల్‌స్టేట్‌మెంట్‌లో మార్పులు తెచ్చుకోండి. అప్పుడు అందంతో పాటూ ఆరోగ్యమూ కాపాడుకోగులుగుతారు.
* ఎత్తు చెప్పులు... వేసుకుంటేనే ఫ్యాషన్‌ కాదు సుమీ! ఇలా ఎక్కువ సేపు మడమలపైనో లేక వేళ్లపైనో మొత్తం భారం వేయడం వల్ల రక్తప్రసరణలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. ఫలితంగా కాళ్లనొప్పులూ, మోకాళ్లపై ఒత్తిడి పడి కీళ్లనొప్పులూ వేధిస్తాయి. అందుకే పాయింట్‌ హీల్స్‌ని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. కాలి పాదం మొత్తం ఆనుకునేలా ఉండే వెడ్జెస్‌, ఫ్లిప్‌ఫ్లాప్స్‌ వంటివాటిని ఎంచుకోవడం మంచిది.రోగ్యాలకూ కారణం అవుతుంది. అవేంటో తెలుసుకుని మరి జాగ్రత్తపడదామా!