తిరుమల లడ్డు ప్రసాదానికి 322 ఏళ్ళు..

తిరుమల లడ్డు ప్రసాదానికి 322 ఏళ్ళు..


- ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీవారి నైవేద్యం.. 
- లడ్డు ప్రసాదాన్ని పవిత్రంగా భావించే భక్తులు.. 
- 2 ఆగష్టు 1715న నైవేద్యంగా లడ్డు తయారీ మొదలు.. 
- ఇప్పటికీ లడ్డు సైజు మారింది గానీ రుచి ఏమాత్రం తగ్గలేదు.. 

హైదరాబాద్, 02 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :

తిరుమల శ్రీవారిని ఎంత భక్తి శ్రద్దలతో దర్శించుకుంటారో.. లడ్డు ప్రసాదాన్ని కూడా అంతే భక్తి శ్రద్దలతో సేవిస్తారు శ్రీవారి భక్తులు.. లడ్డు ప్రసాదం నైవేద్యంగా పెట్టడం మొదలుపెట్టి ఇప్పటికి దాదాపు 322 ఏళ్ళు అయినా.. లడ్డు రుచిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.. అప్పటికి, ఇప్పటికి లడ్డు ప్రసాదం సైజు తగ్గింది.. ధర పెరిగింది.. కానీ రుచి మారకపోవడం నిజంగా అద్భుతమే.. లడ్డూ తయారీలో ఉపయోగించే పదార్ధాలు కొన్ని ఇప్పటికీ ప్రపంచానికి తెలియవంటే ఆశ్చర్యం కలుగక మానదు.. ప్రపంచవ్యాప్తంగా లడ్డూ ప్రసాదానికి విశిష్ట స్ధానం ఉంది..

Tags :