తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..దర్శనానికి 10 గంటలు..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..దర్శనానికి 10 గంటలు..

 

తిరుమల, 04 అక్టోబర్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
శ్రీ సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియుండగా వీరికి 10 గంటల్లో దర్శనం కలుగుతుం దని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న రికార్డుస్థాయిలో 82,815 మంది భక్తులు స్వామివారిని దర్శంచుకోగా 27, 147 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.05 కోట్లు వచ్చిందని తెలిపారు. మహతి కళాక్షేత్రం లో నిర్వహించిన చైత‌న్య బ్రద‌ర్స్ గాత్ర సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తిరుప‌తి లోని అన్నమాచార్య క‌ళామందిరంలో ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు, విద్యార్థులు క‌లిసి వాద్య సంగీత కార్యక్రమం నిర్వహించారు. రామ‌చంద్ర పుష్కరిణిలో తిరుప‌తికి చెందిన బి. కేశ‌వి బృందం నృత్య కార్యక్రమం ఆకట్టుకుంది.

 

Tags :