శాంతి మంత్రం పఠిస్తున్న తాలిబన్లు..

శాంతి మంత్రం పఠిస్తున్న తాలిబన్లు..


- కీలక ప్రకటన చేసిన తాలిబన్ ప్రభుత్వం.. 
- హిందువులు, సిక్కులు తిరిగి రావచ్చు.. 
- హర్షం వెలిబుచ్చిన సిక్కు, హిందూ సంఘాలు.. 
 
ఆఫ్ఘనిస్తాన్, 26 జూలై :
అఫ్ఘానిస్తాన్ అధికార పీఠంపై ఉన్న తాలిబన్లు శాంతి మంత్రం జపిస్తున్నారు. తాజాగా వాళ్లు ఓ కీలక ప్రకటన చేశారు. ‘‘మా దేశంలో పరిస్థితులు చక్కబడ్డాయి. హిందువులు, సిక్కులు అఫ్ఘానిస్తాన్ కు ఇక తిరిగి రావచ్చు’’ అని వారు విజ్ఞప్తి చేశారు. జులై 24న దేశ రాజధాని కాబూల్ లోని హిందూ, సిక్కు వర్గాల ప్రతినిధులతో అఫ్ఘాన్ హోం శాఖ మంత్రి డాక్టర్ ముల్లా అబ్దుల్ వాసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఈమేరకు ప్రకటన విడుదల చేశారు.

అఫ్ఘాన్ లో శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో గతంలో ఎంతోమంది సిక్కులు, హిందువులు వెళ్లిపోయారని, మళ్లీ వారంతా తిరిగి రావాలని కోరారు.  కాగా, జూన్ 18న కాబూల్ లోని కర్తె పర్వాన్ గురుద్వారాపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో దెబ్బతిన్న గురుద్వారా మరమ్మతులకు అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై అక్కడి సిక్కు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Tags :