దేశ భాషలందు తెలుగు లెస్స..

దేశ భాషలందు తెలుగు లెస్స..


- ఘనంగా తెలుగు లెస్స వాట్స్ ఆప్ బృందము, తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశం.. 

అమరావతి, 10 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
మద్దులూరి వారు 2015 లో  ఏర్పాటు చేసిన తెలుగు లెస్స అను తెలుగు భాషాభిమానుల వాట్స్ ఆప్ బృందము..  ఈ ఏడాది నెల్లూరు పట్టణంలో అభిరామ హోటల్ లో 7 వ. వార్షిక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని, తెలుగు భాష గొప్పదనం, వైభవంతో పాటు తెలుగు సంస్కృతి సాంప్రదాయల గురించి చర్చించడం జరిగింది...
నిర్వాహక బృందం  తరపున  పురాణం రామప్రసాద్,  ములుగు విజయదుర్గ , చలంచర్ల  ఫణీంద్ర, పీసపాటి రంగాచార్యులు, వడ్డాది నాగిని లతోపాటు మిగతా సభ్యులు పాల్గొన్నారు..

Tags :