కేసిఆర్ నాయకత్వం దేశానికి అవసరం.

కేసిఆర్ నాయకత్వం దేశానికి అవసరం.


- టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి.. 

మెల్బోర్న్, 13 జూన్ :
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డల మద్దతు ఉంటుందని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. నాలుగేళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలతో భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టామని, ఆ కార్యక్రమంలో దేశానికి చెందిన అన్ని రాష్ట్రాల ప్రధాన పార్టీలకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు కేసీఆర్‌కు మద్దతు తెలిపారని నాగేందర్ రెడ్డి తెలిపారు. 14 ఏళ్ల ఉద్యమం, కేవలం ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్‌ను ఒప్పించి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అనితరసాధ్యమైన అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఆయన నాయకత్వం దేశానికి అవసరమని, కులాలు, మతాల పేరుతో విభజించాలని చూస్తోన్న దేశంలో కేసీఆర్ జాతీయ పార్టీ అనివార్యమైందని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ను దేశ ప్రజలు ఆదరిస్తారని కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు.

Tags :