హైదరాబాద్‌లో 5న టాటాస్ర్టెయ్‌ జాబ్‌మేళా

Updated:04/10/2017 12:00 AM

tatastate jobmela

శేరిలింగంపల్లి, హైదరాబాద్: నిరుద్యోగ యువతి యువకులకు ఈనెల 5న టాటాస్ర్టెయ్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ చదివిన నిరుద్యోగ యువతకు, 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువకులు ఈ మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని వారు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్‌ వార్డు కార్యాలయంలో జరిగే జాబ్‌మేళాలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి 45 రోజుల నుంచి నాలుగు నెలల వరకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉచితంగా శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుందన్నారు.