సస్పెన్స్‌తో ‘సూపర్ స్కెచ్’

Updated:11/05/2018 11:12 AM

super sketch with suspense

శ్రీశుక్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం సూపర్ స్కెచ్. నర్సింగ్ మక్కల, ఇంద్ర, సమీర్‌దత్త, కార్తీక్ రెడ్డి, చక్రి మాగంటి ప్రధాన పాత్రధారులు. రవి చావలి దర్శకుడు. బలరామ్, పద్మనాభరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ పరిశోధనాత్మక సస్పెన్స్ థ్రిల్లర్ ఇతివృత్తమిది. అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగుతుంది. నలుగురు యువకుల నేపథ్యంలో కథ నడుస్తుంది అన్నారు. స్క్రీన్‌ప్లే ప్రధానంగా థ్రిల్లర్ అంశాలతో ఈ కథ సాగుతుంది. వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు చెప్పారు. నర్సింగ్ మక్కల మాట్లాడుతూ ఈ సినిమాలో నేను పోలీస్ క్యారెక్టర్ చేశాను. నేను చెప్పే సంభాషణలు శక్తివంతంగా వుంటూ ఆలోచింపజేస్తాయి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేంద్రరెడ్డి, సంగీతం: కార్తీక్, దర్శకత్వం: రవి చావలి.