మళ్ళీ థియేటర్లు మార్చి 16 నుంచి బంద్‌

Updated:11/03/2018 07:08 AM

strike of theaters from march 16

సర్వీస్‌ ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో థియేటర్లు బంద్‌ పాటించిన సంగతి తెలిసిందే. డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్లు ఛార్జీలను కాస్త తగ్గించడంతో శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ సినిమాలు యథావిధిగా ప్రదర్శిస్తున్నారు. మరోపక్క కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం బంద్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌(టీఎఫ్‌పీసీ) రంగం సిద్ధం చేసింది. మార్చి 16 నుంచి కొత్త సినిమా విడుదల మాత్రమే కాదు.. షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా నిలిపివేయనుంది. ముఖ్యంగా ఆరు డిమాండ్లతో టీఎఫ్‌పీసీ ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించనుంది.

* క్యూబ్‌, యూఎఫ్‌వోలు ఇక నుంచి వర్చువల్‌ ప్రింట్‌ ఫీజును వసూలు చేయకూడదు.
* టికెట్‌ ధరలను సరళీకరించాలి.
* ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఛార్జీలను తగ్గించాలి.
* అన్ని థియేటర్లలో టికెట్లను కంప్యూటరైజ్డ్‌ చేయాలి.
* చిన్న సినిమాల ప్రదర్శనకు తగిన థియేటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
* ప్రొడక్షన్‌ వ్యయాన్ని నియంత్రించాలి.

ఏ ప్రాతిపదికన థియేటర్‌ యజమానులు టికెట్‌ ధరలను నిర్ణయిస్తారని తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రశ్నించింది. ఒక సినిమాకు టికెట్‌ ధరను నిర్ణయించే అధికారం ఆ చిత్ర నిర్మాతకు మాత్రమే ఉంటుందని అన్నారు. థియేటర్లు కేవలం పర్సంటేజీలు, కమిషన్‌ పద్ధతిలో మాత్రమే సినిమాలను విడుదల చేసుకోవాలని, టికెట్‌ ధరలను నిర్ణయించే అధికారం వారికి లేదని టీఎఫ్‌పీసీ పేర్కొంది.

మరోపక్క థియేటర్ల బంద్‌ వల్ల సాధించిందేమిటని దర్శక, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఇదివరకు చెప్పినట్టుగానే డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్లు కేవలం రూ.2 వేలు మాత్రమే ఛార్జీలు తగ్గించారని, ప్రచారచిత్రాల ప్రదర్శన విషయంలోనూ న్యాయం జరగలేదని ఆయన అన్నారు. సెలవుల్లో పెద్ద సినిమాలు ఎక్కువగా విడుదలవుతాయని, మార్చిలో చిన్న సినిమాలను విడుదల చేసుకుందామని చిన్న నిర్మాతలు సిద్ధమైతే, దురుద్దేశంతో బంద్‌ను ప్రకటించారని ఆరోపించారు. కేవలం రూ.2 వేలకే సినిమాలను ప్రదర్శించే డిజటల్‌ కంపెనీలున్నాయన్న నారాయణమూర్తి.. వాటిని రానియ్యకుండా గుత్తాధిపత్యం సాగిస్తోన్న కంపెనీలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతోపాటు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని డిజిటల్‌ ప్రొవైడర్స్‌, చిత్రపరిశ్రమతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

రంగ‌మ్మ‌త్త పాత్ర కోసం అన‌సూయ ఆడిష‌న్

రంగ‌మ్మ‌త్త పాత్ర కోసం అన‌సూయ ఆడిష‌న్

చైనాలో బాహుబ‌లి స‌రికొత్త రికార్డు

చైనాలో బాహుబ‌లి స‌రికొత్త రికార్డు

చ‌ర‌ణ్ మూవీ సెట్‌లో బోయపాటి బ‌ర్త్‌డే వేడుక‌లు

చ‌ర‌ణ్ మూవీ సెట్‌లో బోయపాటి బ‌ర్త్‌డే వేడుక‌లు

ఆ సంఘటనను మర్చిపోలేను

ఆ సంఘటనను మర్చిపోలేను

అర్జున్‌రెడ్డి @ 40

అర్జున్‌రెడ్డి @ 40

వీర్ ది వెడ్డింగ్’ ట్రైలర్..

వీర్ ది వెడ్డింగ్’ ట్రైలర్..

మహానటి' సెకండ్ సింగిల్ సాంగ్ కి టైం ఫిక్స్

మహానటి' సెకండ్ సింగిల్ సాంగ్ కి టైం ఫిక్స్

విరాట్ దుస్తులు ధ‌రించిన అనుష్క‌.. ఫోటోలు వైర‌ల్‌

విరాట్ దుస్తులు ధ‌రించిన అనుష్క‌.. ఫోటోలు వైర‌ల్‌

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR