స్టాక్ మార్కెట్ లో స్వల్ప లాభాలు.. 

స్టాక్ మార్కెట్ లో స్వల్ప లాభాలు.. 

స్టాక్ మార్కెట్ లో స్వల్ప లాభాలు.. 

ఢిల్లీ, 08 డిసెంబర్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 94 పాయింట్ల లాభంతో 62,504 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 18,570 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. ఎల్‌ అండ్‌ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ట్రేడింగ్‌ మొదట్లో లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌, టీసీఎస్‌, కొటక్‌ మహీంద్ర బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరో వైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.82.27 వద్ద ప్రారంభమైంది.

ప్రస్తుతం సెన్సెక్స్‌ 126 పాయింట్లు పెరిగి 62,537 పాయింట్ల వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 18,595 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. ఇదిలా ఉండగా.. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల దృష్ట్యా మార్కెట్‌ ఎలా కొనసాగుతుందనే ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. గ్లోబల్‌ మార్కెట్‌లో యూఎస్‌ మార్కెట్‌ రెండు రోజుల నష్టాల అనంతరం బుధవారం ఫ్లాట్‌గా ముగిసింది. అమెరికా బాండ్‌ మార్కెట్లు మాంద్యం వైపుగా వెళ్తున్నట్లు సూచనల నేపథ్యంలో పెట్టుబడిదారులు ఈక్విటీలో పెట్టుబడులపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఆసియాలోని ప్రధాన మార్కెట్లలో జపాన్‌ నిక్కీ 0.83శాతం క్షీణించింది. బ్రెంట్ ముడి చమురు 2.47 శాతం క్షీణతతో 77 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

Tags :