ముగిసిన శ‌త చండీ మ‌హా యాగం

Updated:15/05/2018 07:03 AM

shatha chandi maha yagam ends

జిల్లాలోని జ‌డ్చ‌ర్ల‌లోని శ్రీ‌గిరి క్షేత్ర అష్టల‌క్ష్మీ దేవాల‌య ప్రాంగ‌ణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన శ‌త చండీ మ‌హా యాగం నేటితో ముగిసింది. యాగంలో భాగంగా మూడవ రోజు యజ్ఞాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి. ల‌క్ష్మారెడ్డి-శ్వేత దంపతులు నిర్వహించారు. ఈ దంపతుల చేత వేద పండితులు గణపతి పూజలు, కలశ పూజలు చేయించారు. ప్రధాన యాగ కుండలి వద్ద మంత్రి దంపతులు క్రతువు నిర్వహించారు. అలాగే 108 హోమ కుండ‌ముల‌లో 108 మంది దంప‌తులు హోమాలు నిర్వహించారు. 13 అధ్యాయాలున్న చండీ హోమం వైభ‌వంగా జరిపించారు. అనంతరం వేద పండితులు శత చండి మహా యాగ ముగింపు పూర్ణాహుతి నిర్వహించారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. 

ఈ సందర్బంగా హోం మంత్రి నాయిని మాట్లాడుతూ.. ప్రజల్లో సుఖశాంతులు వెల్లి విరియాలని కోరారు. గతంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన అయుత చండి యాగం వల్ల వర్షాలు కురిసి రాష్ట్రం బాగు పడిందన్నారు. ఇప్పుడు మంత్రి లక్ష్మారెడ్డి చేసిన యాగం వల్ల మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల ప్రాంతం మరింతగా సస్య శ్యామలం కావాలన్నారు. యాగం నిర్వహించిన మంత్రి లక్ష్మారెడ్డి దంపతులను నాయిని అభినందించారు

సంబంధిత వార్తలు

ఎవాల్వ్ చిల్డ్రన్స్ క్లీనిక్' ను ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి

ఎవాల్వ్ చిల్డ్రన్స్ క్లీనిక్' ను ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి

రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ప్రారంభం

రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ప్రారంభం

సిద్దిపేట రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మహేందర్‌రెడ్డి

సిద్దిపేట రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మహేందర్‌రెడ్డి

ఈదురుగాలులకు ఇంటిపై పడిన కరెంట్ స్తంభం

ఈదురుగాలులకు ఇంటిపై పడిన కరెంట్ స్తంభం

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

వాగులో పడిన ఆయిల్ ట్యాంకర్.. నేలపాలైన ఆయిల్

వాగులో పడిన ఆయిల్ ట్యాంకర్.. నేలపాలైన ఆయిల్

రహదారిపై మృత్యుకాటు

రహదారిపై మృత్యుకాటు

చేప ప్రసాదానికి 2లక్షల చేపపిల్లలు

చేప ప్రసాదానికి 2లక్షల చేపపిల్లలు

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR