అమెరికన్లను వణికిస్తున్న ‘ఐపీఎఫ్’ జబ్బు... ఇప్పటికే 9 మంది వైద్యులు మృతి...

Updated:11/03/2018 04:49 AM

shaking of american doctors for ipf decis

ఓ వింత జబ్బుతో అమెరికా‌ ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా అక్కడి దంత వైద్యులనే ఎక్కువగా ఈ జబ్బు పీడిస్తోంది. ఈ జబ్బు పేరు ఐపీఎఫ్‌(ఇడియోపతిక్‌ పల్మనరీ ఫైబ్రోసిస్‌). ఊపిరితిత్తులు చెడిపోయేలా చేసే ప్రాణాంతకమైన వ్యాధి ఇది. ఇప్పటికే అమెరికా మొత్తంలో 984 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అందులో తొమ్మిది మంది దంత వైద్యులు కావడం గమనార్హం. ఆ తొమ్మిది మందిలో కేవలం ఇద్దరే బతికారు. ఈ తొమ్మిది మంది వైద్యులు వర్జీనియా రాష్ట్రంలోని ఓ డెంటల్‌ క్లీనిక్‌కు చెందినవారే.

దాంతో సీడీసీ(సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్) బోర్డు ఈ వ్యాధిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికాలోని ఇతర జనాభాతో పోలిస్తే 23 రెట్లు ఎక్కువగా దంత వైద్యులే ఈ వ్యాధి బారిన పడుతున్నారని సీడీసీ తెలిపింది. వైద్యులు పనిచేస్తున్న వాతావరణంలోనే ఉండే క్రిములే ఈ వ్యాధికి కారణమని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి మరింత లోతుగా విచారిస్తే..వర్జీనియా రాష్ట్రంలో ఉన్న డెంటల్‌ క్లీనిక్‌లో గత 21 ఏళ్లలో 900 మంది వైద్యులు ఈ ఐపీఎఫ్‌ వ్యాధి బారిన పడ్డారని తేలింది.

ఈ వ్యాధి సోకినప్పుడు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, పొడి దగ్గు, బరువు తగ్గడం, కీళ్ల నొప్పులు వస్తాయి. డెంటల్‌ క్లీనిక్‌లో సిలికా, పాలివిన్సిల్‌ సైలోక్సేన్‌, ఆల్గినేట్‌ వంటి విష పూరిత క్రిములు ఉంటాయి. అక్కడ పనిచేసే వైద్యులు దంత వైద్యానికి సంబంధించిన పరికరాలను శుభ్రం చేస్తున్నప్పుడు ఈ విష పూరిత క్రిముల బారిన పడుతున్నారు.

అగ్రరాజ్యం మొత్తంలో దాదాపు 650,000 మంది దంత వైద్యులు ఉన్నారు. ముదురుతున్న ఐపీఎఫ్‌ కేసుల నేపథ్యంలో డెంటల్‌ క్లీనిక్‌లో పనిచేసేవారందరూ మాస్క్‌లు ధరించాలని సీడీసీ హెచ్చరించింది. అయితే పాతకాలం నాటి చికిత్సలు చేయడం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని మరికొందరు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.