“ఎస్సీ” విద్యార్ధుల “విదేశీ విద్య” కి స్కాలర్‌షిప్‌లు..

Updated:28/03/2018 09:47 AM

scholarships for sc students for foreign education

2017-18 విద్యా సంవత్సరంలో విదేశాల్లో పీజీ (మూడేళ్లు), పీహెచ్‌డీ (నాలుగేళ్లు) చదవాలనుకునే ఎస్సీ మొదలైన సామాజిక వర్గ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలలోకి వెళ్తే..సుమారు 100 స్కాలర్‌షిప్‌లకి గాను 30 స్కాలర్‌షిప్‌లని మహిళలకి కేటాయించారు.


“ఎస్సీ” విద్యార్ధుల “విదేశీ విద్య” కి స్కాలర్‌షిప్‌లు..


స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 100 (30 స్కాలర్‌షిప్‌లను మహిళలకు కేటాయించారు)

సబ్జెక్టుల వారీగా ఖాళీలు: ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్-32, ప్యూర్ సెన్సైస్ అండ్ అప్లైడ్ సెన్సైస్-17, అగ్రికల్చరల్ సెన్సైస్ అండ్ మెడిసిన్-17, ఇంటర్నేషనల్ కామర్స్, అకౌంటింగ్ ఫైనాన్స్-17, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్-17.

అర్హత: పీజీ/యూజీలో 55 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్‌తోపాటు విదేశాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన వర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్లలో పీజీ/పీహెచ్‌డీలో ప్రవేశానికి అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ ఉన్నవారు (లేదా) అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఆదాయం: విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి.

వయసు: 2017 ఏప్రిల్ 1 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక విధానం: (అర్హతలను బట్టి) ‘మొదట వచ్చినవారికి మొదటి ప్రాధాన్యత’ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులను మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పంపాలి.

దరఖాస్తు చివరి తేది: 2018 మార్చి 31

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.socialjustice.nic.in