గౌడ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా..

గౌడ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా..


- మోర్తాడ్ మండల కేంద్రంలోని 63 వ జాతీయ రహదారిపై 
  సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని యధావిధిగా 
   ప్రతిష్టించాలని డిమాండ్..  

నిజామాబాద్, 31 జనవరి ( ఆదాబ్ హైదరాబాద్ ) :
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం, మోర్తాడ్ మండల కేంద్రంలోని 63వ జాతీయ రహదారిపై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని యధావిధిగా ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ డివిజన్ స్థాయి గౌడ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు..

ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ..  గౌడ జాతి ముద్దుబిడ్డ, బహుజన ఆరాధ్య దైవం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని తొలగించడం సరికాదని అన్నారు..  ఆర్మూర్ డివిజన్ లోని గౌడ సంఘం నాయకులు మోర్తాడ్ మండల కేంద్రానికి వచ్చి, జాతీయ రహదారిపై ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ..  సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని తొలగించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.. గౌడ జాతి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను వివిధ కుల సంఘాల నాయకులు మద్దతు తెలిపాయి.. సంఘటన స్థలానికి తహసిల్దార్ బావయ్య, సీఐ వెంకటేశ్వర్లు ఎస్సైలు ముత్యంరాజు, రాజులు చేరుకొని సర్ది చెప్పడంతో ధర్నాను విరమించారు..

Tags :