అభిమానం హద్దులు దాటింది..భాదపడుతూ వెళ్లిపోయిన సమంత!

Updated:12/03/2018 10:15 AM

samantha upset over fans overaction

సినీతారలు ఎక్కడ కనిపించినా అభిమానుల్లో పెద్దఎత్తున ఉత్సాహం కనిపిస్తుంది. ఆ ఉత్సాహం, అభిమానం హద్దులు దాటుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా టాలీవుడ్ లో సినీతారలంటే అభిమానులు వెర్రెత్తిపోయే అభిమానాన్ని ప్రదర్శిస్తారు. పిచ్చి అభిమానం వలన అటు సినీతారలకు, అభిమానులకు ఇబ్బందికర ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనే హీరోయిన్ సమంతకు అనంతపురంలో ఎదురైంది. అభిమాని ప్రదర్శించిన అత్యుత్సాహం వలన అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. సినీతారలంటే అభిమానం సినీతారలంటే అభిమానుల్లో ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.వెండి తెరపై అభిమాన నటులు చేసే డాన్సులు, విన్యాసాలు చూసి ఫాన్స్ వెర్రెత్తిపోతారు.సినీతారలు బయట కనిపించినా అదే తరహాలో అభిమానాన్ని ప్రదర్శిస్తారు. హద్దులు దాటుతున్న అభిమానం ఇటీవల అభిమానం హద్దులు దాటుతున్న దృశ్యాలు ఘటనలు చూస్తూనే ఉన్నాం. హీరోల ఫాన్స్ ప్రదర్శించే అత్యుత్సాహం వలన టాలీవుడ్ లో కొన్ని వివాదాలు సైతం నెలకొన్నాయి. ఇలాంటి ఘటనల వలన సినీతారలకు ఇటు అభిమానులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.

సమంత తాజాగా అనంతపురం జిల్లాలో మెరిసింది. ఓ మొబైల్ షోరూం ఓపెనింగ్ సందర్భంగా సమంత అనంతకు వెళ్ళింది. సమంత కోసం అభిమానులు ఎగబడ్డారు. ఓ అభిమాని సమంతని చూడాలనే మితిమీరిన ఉత్సహంతో దూసుకొచ్చాడు. దీనితో అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. అతడిని నిలువరించే క్రమంలో పోలీస్ లు అతడిపై లాఠీ ఛార్జ్ చేసారు. అనుకోకుండా జరిగిన ఘటనతో సమంత మనస్తాపం చెందింది. కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

సంబంధిత వార్తలు

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

రూ.24 వేల కోట్ల నష్టం

రూ.24 వేల కోట్ల నష్టం

మోదీ ఉన్నతకాలం ప్రత్యేక హోదా రాదని అన్నారు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.

మోదీ ఉన్నతకాలం ప్రత్యేక హోదా రాదని అన్నారు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.

కేసీఆర్ మాటలు ఇంకా గుర్తున్నాయి.., బాబు ఏదైనా బావిలో దూకు

కేసీఆర్ మాటలు ఇంకా గుర్తున్నాయి.., బాబు ఏదైనా బావిలో దూకు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు విసిగిపోయారు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు విసిగిపోయారు

పాద యాత్ర చేయనున్న పవన్ :హోదా కోసం

పాద యాత్ర చేయనున్న పవన్ :హోదా కోసం

మొదటి 100 విద్యాసంస్థల్లో కొనసాగిన ఏపీ, తెలంగాణ హవా

మొదటి 100 విద్యాసంస్థల్లో కొనసాగిన ఏపీ, తెలంగాణ హవా

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR