దృష్టి మళ్లించి..

దృష్టి మళ్లించి..

- రూ. 68 వేలు కాజేసిన దోపిడీ దొంగలు.. 
- బడంగ్ పేట యువకుడికి ఎదురైన దుర్ఘటన.. 
- పోలీసులకు ఫిర్యాదుచేసిన బాధితుడు రాజు.. 
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. 
- రాజేంద్ర నగర్ లో ఒక ఇంటిని దోచుకున్న మరో సంఘటన..  
హైదరాబాద్, 19 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్ పేట్ లో ఓ యువకుడి దృష్టి మళ్లించి డబ్బులు కాజేశారు దారి దోపిడీ దొంగలు. బడంగ్ పేట్ నుంచి 68 వేల నగదుతో వస్తున్న రాజు అనే యువకుడి దృష్టి మళ్లించారు దొంగలు. డబ్బులు కిందపడిపోతున్నాయని పేపర్ లో పెట్టుకొని తీసుకెళ్లాలని సూచించారు. వాళ్లే డబ్బులు పేపర్ లో పెట్టి స్కూటీలో పెట్టారని బాధితుడు రాజు తెలిపాడు. అయితే ఇంటికి వెళ్లి చూసే సరికి డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. మోసపోయినట్లు గ్రహించిన రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు కాజేస్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అత్తాపూర్ డివిజన్ లోని ఎర్రబొడాలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 2 కిలోల వెండి, 50 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇంట్లో వాళ్లంతా కడపలో పెళ్లి చూపులకు కోసం వెళ్లిన టైంలో దొంగతనం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

Tags :