బంగ్లా టెస్ట్ సీరీస్ కు రోహిత్ దూరం.. 

బంగ్లా టెస్ట్ సీరీస్ కు రోహిత్ దూరం.. 

బంగ్లా టెస్ట్ సీరీస్ కు రోహిత్ దూరం.. 
దాకా, 08 డిసెంబర్ :
 బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు దూరమయ్యే ఆడడం అనుమానాస్పదంగా మారింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో రోహిత్‌ ఎడమ చేతి బొటన వేలికి గాయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫీల్డింగ్‌ చేయలేదు. కెప్టెన్‌ బాధ్యతను కేఎల్‌ రాహుల్‌ స్వీకరించాడు. అయితే, బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ శర్మ క్రీజ్‌లోకి వచ్చి సెంచరీ సాధించాడు. కెప్టెన్‌ ఇన్నింగ్స్ ఆడినా మ్యాచ్‌లో భారత్‌ విజయాన్ని సాధించలేకపోయింది. మ్యాచ్‌ అనంతరం కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాట్లాడుడూ నిపుణుల సలహాలు తీసుకునేందుకు రోహిత్‌ శర్మ స్వదేశానికి తిరిగి వెళ్లనున్నట్లు తెలిపాడు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌తో పాటు గాయం కారణంగా దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ సేన్‌ సైతం మూడో వన్డేకు దూరమయ్యారని ద్రవిడ్‌ తెలిపాడు. ఇదిలా ఉండగా.. మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడాడు. ‘బొటనవేలికి అయిన గాయం అంతపెద్దదేం కాదు. అదృష్టవశాత్తు ఎలాంటి ఫ్రాక్చర్‌ కాలేదు. కాబట్టే బ్యాటింగ్‌ చేయగలిగాను’ అని చెప్పాడు.

ఈ నెల 14 నుంచి బంగ్లాతో టెస్టు సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో రోహిత్‌ ఆడగలడా? లేదా? అన్నది తనకు తెలియదని ద్రావిడ్‌ పేర్కొన్నాడు. మూడో వన్డేకు రోహిత్‌, కుల్‌దీప్‌, దీపక్‌లు మూడో వన్డేకు దూరమయ్యారన్న ద్రావిడ్‌.. రోహిత్‌ ముంబై వెళ్లి స్పెషలిస్ట్‌ వైద్యులను సంప్రదిస్తాడని తెలిపారు. ఈ పరిస్థితుల్లో టెస్టు సిరీస్‌ ఆడతాడో లేదో చెప్పే పరిస్థితుల్లో లేమని చెప్పాడు. గాయం తీవ్రమైతే కోలుకునేందుకు మూడు నాలుగు వారాల సమయం పడుతుంది. బంగ్లాతో జరిగిన రెండో వన్డే రెండో ఓవర్‌లో రోహిత్‌ శర్మ గాయపడ్డాడు. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన బంతిని అనాముల్‌ హక్‌ బ్యాట్‌కు తగిలి బంతి స్లిప్‌లోకి వెళ్లింది. స్లిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మ చేతికి తగిలి కిందపడింది. ఆ తర్వాత రోహిత్‌ నొప్పితో బాధపడడం కనిపించింది.

Tags :