బంగార్రాజు కోసం సిద్ధం?

Updated:14/05/2018 12:54 PM

ready for bangaru raju

సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో బంగార్రాజు పాత్రలో ప్రేక్షకుల్ని అలరించారు నాగార్జున. తన కెరీర్‌లో బంగార్రాజు పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని అనేక సందర్భాల్లో చెప్పారాయన. తాజాగా ఈ చిత్రానికి బంగార్రాజు పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల స్క్రిప్ట్‌వర్క్ ప్రారంభించినట్లుగా తెలిసింది. సోగ్గాడే చిన్నినాయనా తరహాలోనే ఆద్యంతం వినోదం, సెంటిమెంట్ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. నాగార్జున తాజా చిత్రం ఆఫీసర్ త్వరలో విడుదలకానుంది. ప్రస్తుతం ఆయన మరే కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు. సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్‌పైనే నాగార్జున ఆసక్తిగా వున్నారని చెబతున్నారు. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ ఇటీవలే రవితేజతో నేల టిక్కెట్టు చిత్రాన్ని పూర్తి చేశారు. దాంతో బంగార్రాజు త్వరలో తెరపైకి వచ్చే అవకాశముందని సమాచారం.