రాజ్యసభకు ఆర్. కృష్ణయ్య ఎన్నిక పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు..

రాజ్యసభకు ఆర్. కృష్ణయ్య ఎన్నిక పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు..

- ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కొంటాం..  
- పార్లమెంటులో బిసి బిల్లు సాధిస్తాo.. 
- ఆశాభావం వ్యక్తం చేసిన బిసి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్..

హైదరాబాద్, 03 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
రాజ్యసభకు జాతీయ బిసి సంక్షేమ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఎన్నిక చారిత్రాత్మక ఘట్టమని ఈ ఎన్నిక పట్ల దేశంలోని అన్ని ప్రాంతాలలోని బిసిలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని జాతీయ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ..ఇందుకు సహకరించిన వై.ఎస్.ఆర్.సి.పీ. పార్టీకి, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.  

ఆర్. కృష్ణయ్యపై కొనసాగుతున్న అగ్రవర్ణాల కుట్రలు గర్హనీయమన్నారు.. బీసీల ఎదుగుదలను ఓర్వలేని అగ్రవర్ణాలలోని కొందరు దుష్టులు ఆర్.  కృష్ణయ్యపై విచక్షణా రహితంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు.. ఇటువంటి చవకబారు విధానాలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.. తాటాకు చప్పుల్లకు బిసిలు  బెదరరనీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో పార్లమెంటు వేదిక గా బిసి బిల్లు సాధించేవరకు వెనక్కే తగ్గది లేదనీ దాసు సురేశ్ తేల్చి చెప్పారు.

Tags :