పవర్ స్టార్ క్లాప్ తో మొదలైన విశ్వక్ సేన్ కొత్త సినిమా..

పవర్ స్టార్ క్లాప్ తో మొదలైన విశ్వక్ సేన్ కొత్త సినిమా..

 

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్‌ హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈ మూవీలో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా నటించడం విశేషం. ఇందులో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా, ఈ చిత్రం ఇవాళ హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన హీరో హీరోయిన్ పై క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నటులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కూడా హాజరవడం విశేషం. 

త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా నీరజ కోన, లిరిసిస్ట్‌గా చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్‌గా బాలమురుగన్ వ్యవహరిస్తున్నారు. 

Tags :