చౌటుప్పల్‌లో జేబు దొంగలు అరెస్ట్

Updated:16/04/2018 12:40 PM

pocket thieves arrested by choutuppal police

జిల్లాలోని చౌటుప్పల్‌లో ఎనిమిది మంది జేబు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కారు, రూ. 1,80,180 నగదు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జేబు దొంగలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను పోలీసులు హెచ్చరించారు.