పత్తాలాడుతూ పట్టుబడ్డ టీపీసీసీ సెక్రటరీ మధుసుధన్‌రెడ్డి..

– రేవంత్ ప్రధాన అనుచరుడే ఈయన..
– మొయినాబాద్‌లో ఎస్వోటీ పోలీసుల దాడి..
– రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ10 మంది నేతలు..
– రూ.14 లక్షలు, 5 సెల్ఫోన్లు, 7 కార్లు స్వాధీనం..
– రాత్రి 1 గంటల సమయంలో ఘటన..
చేవెళ్ల, 20 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) :
చేసేటివి గొప్ప గొప్ప వ్యాపారాలు.. గొప్ప గొప్ప రాజకీయాలు.. రాష్ట్రాన్ని శాసించే వారితో స్నేహాలు.. చేసేటివి గుడిసేటీ పనులు.. అన్నట్లు మొయినాబాద్‌లో పేకాట రాయుళ్ల వ్యాపారం నడుస్తోంది. ఆదివారం అర్థరాత్రి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల సురభి ఎన్‌క్లేవ్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో జూదం అడుతూ 10 మంది నేతలు పట్టపడ్డారు.. అందులో కీలకంగా కాంగ్రెస్‌పార్టీ టీపీసీసీ సెక్రటరీ ఎలుగంటి మధుసుధన్ రెడ్డితో పాటు 9 మంది నేతలు పట్టు పడ్డారు. మొయినాబాద్ సీఐ, శంషాబాద్ జోన్ ఎస్.ఓటీ సీఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్‌లో ఎనుముల మధుసుధన్‌రెడ్డి, ఎండీ జాహీంగీర్, ఎంపీ పాడు, ఎం. మహేందర్‌రెడ్డి, ఎం. సురేష్, డి. రవీంధర్‌రెడ్డి, పి. ప్రశాంత్, పి. మల్లెష్ యాదవ్, సి. శ్రీనివాస్‌గౌడ్ లు దొరికినవారిలో ఉన్నట్లు తెలిపారు. ఏడు సెల్ ఫోన్లు, ఐదు కార్లలతో పాటు రూ. 14.71 లక్షల రూపాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మూడు ఇన్నోవా క్రిష్ట కార్లు, రెండు ఫార్జునరీ కార్లను కూడ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై ఎఫ్ఐఆర్ చేసి నట్లు వివరించారు..
ఇది కొత్తెంకాదంటున్న స్థానికులు :
ఇలాంటివి ఎన్నో సార్లు జరిగినట్లు, పోలీసుల దృష్టికి కూడా వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది కూడా ఒకటి రెండు రోజులు మాత్రమే.. హడావుడి తర్వాత ఇదంతా మామూలు అవుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా చెప్పుకునే ఎలుగంటి మధుసుధన్ రెడ్డి ఇదివరకే హెచ్చరించి వదిలేసినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు.