పింగళి వెంకయ్య 146 వ జయంతి..

పింగళి వెంకయ్య 146 వ జయంతి..


( ఘన నివాళులర్పించిన యువజన కాంగ్రెస్ నాయకులు ఎస్.పీ. క్రాంతి కుమార్.. )
హైదరాబాద్, 03 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :
స్వాతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా టాంక్ బండ్ పై ఉన్న ఆయన విగ్రహం వద్ద రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు ఎస్.పి.క్రాంతి కుమార్ అధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. అయితే టాంక్ బండ్ వద్ద పింగళి వెంకయ్య విగ్రహాని వద్ద ప్రభుత్వం తరపున ఎలాంటి ఏర్పాట్లు కానీ కనీసం పూల అలంకరణ కూడా చేయకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఆజాది కా అమృత్ మహోత్సవ్ జరుపుతున్న వేళ మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పింగళి వెంకయ్య స్వస్థలంలో కార్యక్రమలు చేస్తుంటే ఇక్కడ ఆయన సొంత పార్లమెంట్ లో మాత్రం పింగళి వెంకయ్య విగ్రహానికి కనీసం నివాళులు అర్పించడానికి బీజేపీ నేతలు కూడా రాకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అది అవినాష్, జి.నవీన్ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Tags :