రూ.300 కోట్ల క్లబ్‌ దిశగా పఠాన్‌.. !

రూ.300 కోట్ల క్లబ్‌ దిశగా పఠాన్‌.. !

 

నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తున్నాడు స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan). సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం పఠాన్ (Pathaan). ఈ స్పై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. మొదటి రోజు నుంచి కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే అంటున్నాడు షారుఖ్‌ ఖాన్‌. పఠాన్‌ ఇప్పటివరకు రూ.296.5 కోట్లు గ్రాస్‌ రాబట్టింది. ట్రేడ్‌ సర్కిల్ టాక్‌ ప్రకారం పఠాన్‌ రూ.300 కోట్ల క్లబ్‌లోకి నేడే ఎంట్రీ ఇవ్వనుంది. ఇదే నిజమైతే కేవలం వారం రోజుల్లోనే అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన తొలి హిందీ (హిందీ డబ్బింగ్‌ సినిమాలతో సహా) సినిమాగా పఠాన్‌ నిలవనుంది. ఈ అరుదైన ఫీట్ అందుకోబోతున్న షారుఖ్‌ ఖాన్‌ తొలి సినిమాగా రికార్డుల్లో నిలిచిపోనుంది. బాహుబలి 2 (10 రోజులు), కేజీఎఫ్ 2 (11 రోజులు) సినిమాలను బీట్‌ చేసి మరి 7 రోజుల్లోనే అరుదైన రికార్డుతో టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిపోనుంది పఠాన్‌.

పఠాన్‌ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషించింది. ఓ వైపు గ్లామరస్‌గా అందాలు ఆరబోస్తూనే.. మరోవైపు యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. జాన్‌ అబ్రహాం నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించగా.. సల్మాన్‌ ఖాన్ గెస్ట్‌ రోల్‌లో నటించాడు. బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్‌ హౌజ్‌ యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌ భారీ బడ్జెట్‌తో పఠాన్‌ చిత్రాన్ని తెరకెక్కించింది.

Tags :