రూ. 50కోట్ల రుణాలకు పాస్‌పోర్టు వివరాలు తప్పనిసరి

Updated:11/03/2018 04:30 AM

passport should be need for rs. 5o crores loans

బ్యాంకుల నుంచి రూ. 50కోట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకునేవారు పాస్‌పోర్టు వివరాలను ఇవ్వాలంటూ వస్తున్న వార్తలపై మరింత స్పష్టత వచ్చింది. బ్యాంకులు రూ. 50 కోట్ల పైబడి రుణాలు ఇవ్వాలంటే ఆ ఖాతాదారుల పాస్‌పోర్టు వివరాలు తప్పనిసరి అని కేంద్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రుణాలు తీసుకుని మోసగాళ్లు విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

‘బాధ్యతాయుతమైన, పారదర్శకమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ కోసం ఇది మరో అడుగు. బ్యాంకుల నుంచి రూ. 50కోట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటే పాస్‌పోర్ట్‌ వివరాలు తప్పనిసరి. బ్యాంకు మోసాల కేసులను పరిష్కరించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది’ అని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ ట్వీట్ చేశారు. కొత్తగా రూ. 50కోట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకునే వారి నుంచి పాస్‌పోర్టు వివరాలను తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించినట్లు తెలిపారు. ఇక ఇప్పటికే అంతమొత్తంలో రుణాలు తీసుకున్న వారి నుంచి 45 రోజుల్లోగా పాస్‌ పోర్టు వివరాలు తీసుకోవాలని సూచించామన్నారు. ఒకవేళ సదరు ఖాతాదారులు వివరాలు ఇవ్వకపోతే బ్యాంకులు వారిపై చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.

ఇటీవల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ. 12వేల కోట్ల భారీ కుంభకోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన బంధువు మెహుల్‌ ఛౌక్సీ దేశం విడిచి వెళ్లిపోయారు. అంతకుముందు విజయ్‌ మాల్యా, జతిన్‌ మోహతా తదితరులు కూడా బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అధిక మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేవారి పట్ల నిఘా ఉంచాలని చూస్తోంది. అలాంటి వారి నుంచి పాస్‌పోర్టు వివరాలు ముందుగానే తీసుకుంటే వారు దేశం విడిచి వెళ్లకుండా ఆపొచ్చని భావిస్తోంది.

ఇదిలా ఉండగా.. బ్యాంకు మోసాల నేపథ్యంలో తీసుకొచ్చిన ఫ్యుగిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్స్‌ బిల్లుకు గతవారం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే నీరవ్‌ మోదీలా దేశం విడిచి వెళ్లిపోయిన వారి నుంచి బకాయిలు వసూలు చేసుకునేందుకు వారి ఆస్తులను వీలైనంత వెంటనే విక్రయించే అవకాశం బ్యాంకులకు ఉంటుంది. రూ. 100కోట్ల పైబడి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది.

సంబంధిత వార్తలు

జియోకు పోటీగా ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.49కే 3జీబీ డేటా..!

జియోకు పోటీగా ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.49కే 3జీబీ డేటా..!

వచ్చేస్తున్నాయ్..! జియో 4జీ ల్యాప్‌టాప్‌లు..!

వచ్చేస్తున్నాయ్..! జియో 4జీ ల్యాప్‌టాప్‌లు..!

రూ.5,499కే రీచ్ మొబైల్ కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్

రూ.5,499కే రీచ్ మొబైల్ కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ కార్నివాల్‌.. త‌క్కువ ధ‌ర‌ల‌కే శాంసంగ్ ఫోన్లు..!

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ కార్నివాల్‌.. త‌క్కువ ధ‌ర‌ల‌కే శాంసంగ్ ఫోన్లు..!

ఇక‌పై మీ ఇన్‌స్టాగ్రాం డేటాను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు..!

ఇక‌పై మీ ఇన్‌స్టాగ్రాం డేటాను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు..!

ఎయిర్‌టెల్ 30 జీబీ ఫ్రీ డేటా!

ఎయిర్‌టెల్ 30 జీబీ ఫ్రీ డేటా!

ఐఫోన్‌6ఎస్‌.. ఇక మేడిన్‌ ఇండియా

ఐఫోన్‌6ఎస్‌.. ఇక మేడిన్‌ ఇండియా

ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌లో మరో హైదరాబాద్‌ కంపెనీ

ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌లో మరో హైదరాబాద్‌ కంపెనీ

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR