ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లులు పాస్ చేయాలి..

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లులు పాస్ చేయాలి..


- డిమాండ్ చేసిన మహిళా బీసీ సంక్షేమ సంఘం 
  రాష్ట్ర అధ్యక్షులు గుండ్రాతి శారదా గౌడ్.. 
హైదరాబాద్, 31 జనవరి ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఈ పార్లమెంట్ సమావేశాలలోనే సంపూర్ణ మెజారిటీ ఉన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోఢీ..  గత 15సం లుగా వాయిదా వేస్తున్న మహిళా బిల్లును పాస్ చేయాలని  మహిళా బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు గుండ్రాతి శారదాగౌడ్ బీసీ మహిళా సమావేశంలో డిమాండ్ చేసారు... మహిళా సాధికారికత అనేది మాటలలో కాదు చేతలలో నిరూపించాలనీ, పార్లమెంట్ అసెంబ్లీలలో మహిళా ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం ఉన్నప్పుడే ఈ దేశానికి గౌరవం, అభివృద్ధి..  చట్టసభలలో మహిళల ప్రవేశంతో ప్రజాస్వామ్యంలో రోజు రోజుకు పెరిగిపోతున్న నేరప్రవృత్తి తగ్గే అవకాశం ఉంటుంది.. ఏ మహిళల హక్కుల కోసం నాడు బాబా సాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేశారో.. ఆ హక్కులను మహిళలకు కల్పించి కేంద్ర ప్రభుత్వం తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలనీ శారదాగౌడ్ అన్నారు.. ఈ కార్యక్రమంలో జయంతి, సౌమ్య, సునీత, సరస్వతి, సరిత, రాజమణి తదితరులు పాల్గొన్నారు..

Tags :