పాకిస్థాన్ ఉగ్రవాది హతం..

పాకిస్థాన్ ఉగ్రవాది హతం..


- జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. 
- మరో ముగ్గురిని పట్టుకున్న భద్రతా బలగాలు.. 
- కుల్గామ్‌లో కాల్పుల మోత‌.. 

జమ్మూ కాశ్మీర్, 19 జూన్ :
జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో భద్రతా దళాలు.. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకి చెందిన ఒక పాకిస్థానీ ఉగ్రవాదిని హతమార్చాయి. మరో ముగ్గురిని పట్టుకున్నాయి. అరెస్టయిన ఉగ్రవాది షోకెట్ అహ్మద్ షేక్‌ ద్వారా ఉగ్రవాదుల రహస్య స్థావరాలను అన్వేషిస్తున్న సమయంలో.. దాక్కున్న ఉగ్రవాదులు దళ సిబ్బందిపై కాల్పులు జరిపారని కశ్మీర్ జోన్ పోలీసులు చెప్పారు. ఈ కాల్పుల ఘటనలో ఒక టెర్రరిస్ట్‌ను మట్టుబెట్టామని హతమయ్యాడని తెలిపారు. హతమైన ఉగ్రవాదిని నిషిద్ధ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న పాకిస్థానీగా గుర్తించినట్టు, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ విషయంపై ఐజీపీ కశ్మీర్ ట్వీట్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాలకు చిక్కారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌లోని దమ్‌హాల్ హంజి పోరా ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పులు జరుగుతున్నాయని, అయితే ఇరువైపులా ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్టు ఇప్పటివరకు నివేదికలు రాలేదని వారు తెలిపారు.

 

Tags :