వన్ ప్లస్ 6 లుక్ అదిరిపోయింది

Updated:14/05/2018 02:56 AM

one plus 6 look is good

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ 6ను ఈ నెల 16వ తేదీన విడుదల చేయనున్న విషయం విదితమే. మరికొద్ది గంటల్లో ఈ ఫోన్ విడుదల కానుండగా దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్‌లో లీకయ్యాయి. లీకైన ఇమేజ్‌లను బట్టి చూస్తే వన్ ప్లస్ 6 లుక్ అదుర్స్ అన్న రీతిలో ఉంది. 

ఆన్‌లైన్‌లో లీకైన ఫొటోల ప్రకారం వన్ ప్లస్ 6 లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఫుల్ వ్యూ డిస్‌ప్లే, పై భాగంలో ఐఫోన్ 10 తరహాలో నాచ్, మ్యాట్ ఫినిషింగ్, గ్లాస్సీ లుక్‌తో వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇక ఇందులో ఫీచర్ల విషయానికి వస్తే.. 6.28 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ తదితర ఫీచర్లు వన్ ప్లస్ 6 ఫోన్‌లో ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు.

 

సంబంధిత వార్తలు

జియోకు పోటీగా రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

జియోకు పోటీగా రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

యూట్యూబ్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..

యూట్యూబ్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..

మోటోరోలా నుంచి మోటో జడ్3 ప్లే స్మార్ట్‌ఫోన్

మోటోరోలా నుంచి మోటో జడ్3 ప్లే స్మార్ట్‌ఫోన్

హువావే నుంచి వై3 2018 స్మార్ట్‌ఫోన్

హువావే నుంచి వై3 2018 స్మార్ట్‌ఫోన్

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

రెండు నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్

రెండు నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్

వాట్సాప్‌లో మెసేజ్ బాంబులు.. ఓపెన్ చేస్తే అంతే సంగతులు.

వాట్సాప్‌లో మెసేజ్ బాంబులు.. ఓపెన్ చేస్తే అంతే సంగతులు.

ఈ నెల 15న విడుదల కానున్న హానర్ 10 స్మార్ట్‌ఫోన్

ఈ నెల 15న విడుదల కానున్న హానర్ 10 స్మార్ట్‌ఫోన్

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR