మే నెలాఖరులోగా నైరుతి రుతుపవనాలు

Updated:16/04/2018 04:33 AM

normal rainfall occurs this year

రైతులకు శుభవార్త. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోగా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ సందర్భంగా నైరుతి రుతుపవనాల ఆగమనంపై ఐఎండీ డీజీ రమేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. తీరం తాకిన తర్వాత నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించడానికి 45 రోజులు పడుతుందని ఆయన తెలిపారు. రెండో దశ రుతుపవనాల పరిస్థితిని జూన్‌లో పరిశీలిస్తామన్నారు. వరుసగా మూడో ఏడాది నైరుతి రుతుపవనాలు సాదారణంగానే ఉంటాయని రమేశ్ తెలిపారు. ప్రతి నెల రుతుపవనాల గమనాన్ని అంచనా వేసి.. వివరాలు అందిస్తామని తెలిపారు.