నో పాలిటిక్స్... ఓన్లీ డెవలప్మెంట్..

నో పాలిటిక్స్... ఓన్లీ డెవలప్మెంట్..


( విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ పునరుద్ఘాటన.. ) 
- ఇప్పటికే అనేక రంగాలకు నిధుల కేటాయింపు.. 
- భాగ్యనగరం అభివృద్దిలో భాగస్వామ్యం అయ్యాం.. 
- ఫ్లై ఓవర్లు, సైన్స్‌ సిటీ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఏర్పాటు.. 
- త్వరలోనే తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు.. 
- భారీగా జనం తరలి రావడంపై బండికి అభినందనలు.. 
- కేసీఆర్, టిఆర్‌ఎస్‌ ప్రస్తావన లేకుండా మోడీ ప్రసంగం.. 

హైదరాబాద్, 03 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ‌లో అధికారం చేజిక్కించుకోవ‌డానికి తెలంగాణ రాష్ట్ర స‌మితి, భార‌తీయ జ‌న‌తాపార్టీలు ఒక‌వైపు మ‌ద‌గ‌జాల్లా త‌ల‌ప‌డుతుంటే మ‌రోవైపు అధికారానికి కూత‌వేటు దూరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం త‌న‌లో తానే భీక‌ర‌యుద్ధం చేస్తోంది. త‌న‌లోని శ‌త్రువుల‌తో, త‌న ప్ర‌త్య‌ర్థుల‌తో యుద్ధం చేస్తూ అస‌లైన ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌రిచిపోతోంది. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వ‌స్తోన్న త‌న పాత వాస‌న‌ల‌ను పోగొట్టుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఒక‌వైపు టీఆర్ఎస్ నువ్వా? నేనా? అన్న‌ట్లుగా బీజేపీతో త‌ల‌ప‌డుతోంది. వాస్త‌వానికి కాంగ్రెస్ తో త‌ల‌ప‌డాల్సిన టీఆర్ఎస్ వ్యూహం మార్చి బీజేపీతో త‌ల‌ప‌డుతోంది. దీంతో టీఆర్ఎస్ త‌ర్వాత ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకునే అవ‌కాశం ఉంద‌న్న రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌ల‌ను ప‌క్క‌కు తోసిరాజ‌ని కాంగ్రెస్ పార్టీ నేత‌లు త‌మ మాట‌లు, చేష్ట‌ల‌తో చేజేతులా అధికారాన్ని వ‌దులుకునే అవ‌కాశాలున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇసుక వేస్తే రాలని జనం..మోడీమోడీ అన్న నినాదాల మధ్య ప్రధాని మోడీ విజయసంకల్ప సభలో తెలంగాణ అభివృద్ది, డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఆవశ్యకతను వివరిస్తూ..తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యంగా ప్రకటించారు. తన ప్రసంగంలో ఎక్కడా కెసిఆర్‌ను లేదా  టిఆర్‌ఎస్‌ పేరును ప్రస్తావించకుండా తెలంగాణ అభివృద్దికిఎన్ని రకాల పథకాలకింద ఎంతగా కేటాయించిందీ వివరించారు. ప్రాచీన సంస్కృతి, పరాక్రమాలకు తెలంగాణ పుణ్యస్థలమని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ విజయసంకల్ప సభలో ప్రసంగించిన ఆయన తెలంగాణలో కళ, కౌశలం, పని తనం పుష్కలంగా ఉన్నాయన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగించి.. నాయకులు, కార్యకర్తల్లో జోష్‌ నింపారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సభా వేదికపైకి చేరుకోగానే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మోదీ భుజం తట్టి అభినందించారు. బీజేపీ శ్రేణులతో పరేడ్‌ గ్రౌండ్స్‌ కిక్కిరిసిపోయింది. బీజేపీని ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఈ సభకు వచ్చారనిపిస్తోంది. విూరు నాపట్ల చూపిన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. హైదరాబాద్‌కు ప్రతిభకు పట్టం కడుతుంది. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది.తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు సోదర, సోదరీమణులకు, మాతృమూర్తులకు నా నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టారు. తెలంగాణ పరాక్రమానికి పుట్టినిల్లని, రాష్ట్ర ప్రజలు అంకితభావానికి పెట్టింది పేరని ప్రధాని మోడీ అన్నారు. భద్రాద్రి సీతారాముడి నుంచి యాదాద్రి నరసింహస్వామి దాకా.. ఆలంపూర్‌ జోగుళాంబ నుంచి వరంగల్‌ లోని భద్రకాళి దాకా రామప్ప నుంచి కాకతీయ తోరణం దాకా తెలంగాణ ఆర్కిటెక్చర్‌ గర్వం కలిగిస్తుందని చెప్పారు. భద్రాచలం రామదాసు నుంచి పాల్కురికి సోమనాథుడి వరకు ఇక్కడి భూమి గురించి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఇది యావత్‌ దేశానికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఇలాంటి తెలంగాణను అభివృద్ధి చేయడానికి బీజేపీ తొలి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం పని చేస్తున్నామని చెప్పారు. కరోనాకష్టంలో తెలంగాణలో ఉచితంగా వ్యాక్సినేషన్‌ అందించామన్నారు. పేదలకు ఉచిత కరోనా వైద్యం అందాలనే కేంద్ర ప్రభుత్వ విధానం కూడా పక్కాగా అమలవుతోందని, అందుకే ప్రజలు బీజేపీపై నమ్మకం గా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎంతో సఫలత ఇచ్చారుని చెప్పారు. బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఉన్న రాష్టాల్ల్రో అభివృద్ధి ఎంతో వేగంగా జరుగు తోందన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు కోసం తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ ప్రాధాన్యమని, రాష్ట్రభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించామని తెలిపారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ, ప్రతి రంగానికీ చేరేలా నిరంతం పని చేస్తున్నామన్నారు. దశాబ్దాలుగా అణచివేతకు గురైనవారిని అభివృద్దిలో భాగస్వామ్యుల్ని చేశామన్నారు. కరోనా సమయంలో తెలంగాణలో ప్రతి కుటుంబానికి సాయం చేశామని, వేగంగా కరోనా వ్యాక్సీన్లు అందించామని వివరించారు. ఉచితంగా రేషన్‌, పేదలకు ఉచిత వైద్యాన్ని అందించామని, అందుకే సగటు భారతీయుడికి బీజేపీపై విశ్వాసం ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా ఆ నమ్మకం పెరుగుతూనే ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ’కనుచూపు మేర యువతే కనిపిస్తుంది. విూ ఉత్సాహాన్ని దేశం మొత్తం చూస్తోంది. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణలో బీజేపీకి లభించిన మద్దతు పెరుగుతూనే ఉందని వ్యాఖ్యనించారు. జన్‌ధన్‌ ద్వారా 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించామని, అందులో కోటికిపైగా జన్‌ ధన్‌ ఖాతాలు తెలంగాణవని, వీటిలో 55 శాతం మహిళలవే అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ముద్ర, స్టాండ్‌ అప్‌ ఇండియా ద్వారా ఇచ్చిన లోన్లలోనూ మహిళలకే పెద్దపీట వేశామని చెప్పారు. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు కూడా ప్రత్యేక పథకాల ద్వారా చేయూత ఇచ్చామన్నారు. హైదరాబాద్‌ ఆధునిక సైన్స్‌ సిటీ ఏర్పాటుకు తాము ఎంతో కాలంగా కృషి చేస్తున్నామని, అలాంటి సైన్స్‌ సెంటర్‌ ఒకటి ఇప్పటికే హైదరాబాద్‌లో సిద్ధమైంద న్నారు. తెలుగు విూడియంలోనూ టెక్నాలజీ, మెడికల్‌ చదువులు మొదలైతే పేద, గ్రావిూణ ప్రాంత విద్యార్థుల కల నెరవేరుతుందని తెలిపారు. రామగుండం ఎరువుల కార్ఖానా కూడా ఆత్మ నిర్భర్‌ భారత్‌లో ముఖ్య భాగంగా నిలుస్తోందన్నారు. గతంలో మూతపడిన ఈ కార్ఖానాను మళ్లీ తెరిపించే పనిని తాము 2015లో మొదలు పెట్టామని, ఇప్పుడక్కడ ఉత్పత్తి పక్రియ మొదలైందని, ఇది తెలంగాణ, యావత్‌ భారత దేశ రైతులకు వరంగా పరిణమిస్తోందని చెప్పారు. దళితులు, ఆదివాసీల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చింది.  సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి. 8 ఏళ్లుగా ప్రజల జీవనప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించాం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోందని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు.  డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు.రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందన్నారు.తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మిస్తామని చెప్పారు.మా పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రోత్సాహం ఇస్తున్నామని, మహిళా సాధికారత దిశగా ముందడుగు వేస్తున్నామని అన్నారు.హైదరాబాద్‌లో సైన్స్‌ సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని,బయో మెడికల్‌ సైన్సెస్‌ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయన్నారు. తెలంగాణలో 5 నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని అన్నారు.రైతుల కోసం కనీస మద్దతు ధరను పెంచాం.హైదరాబాద్‌లో రూ.1500 కోట్లతో ఫ్లైవర్లు, ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌లు నిర్మిస్తున్నామని,రూ.350 కోట్లతో హైదరాబాద్‌కు మరో రీజనల్‌ రింగ్‌ రోడ్డు మంజూరు చేశామని మోదీ ప్రకటించారు.

రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలి.. కేసీఆర్ గడీని బద్దలు కొట్టాల్సిందే :
విజయసంకల్ప సభలో బండి సంజయ్‌ పిలుపు.. 

సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభలో ప్రసంగించిన బండి సంజయ్‌.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వచ్చేలా ప్రజలు మద్దతివ్వాలన్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. దేశ ప్రజల పాలిట దేవుడు.. నరేంద్ర మోదీ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీపై తెరాస నేతల విమర్శలు చూస్తే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీని ఎందుకు తిడుతున్నారో తెరాస నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ లబ్ది కోసమే మోదీని కేసీఆర్‌ తిడుతున్నారని ఆరోపించారు. పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించేందుకే ఇక్కడ కార్యవర్గ సమావేశాలు పెట్టామని వివరించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా భాజపా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదని బండి సంజయ్‌ తెలిపారు. త్వరలోనే కేసీఆర్‌ గడీలు బద్ధలుగొడతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలని మోదీ పదేపదే చెబుతారని.. కానీ అందుకు తెరాస ప్రభుత్వం సహకరించడం లేదని వివరించారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే.. భాజపా ప్రభుత్వం రావాలని స్పష్టం చేశారు. కేంద్రంలో మరో 20 ఏళ్లపాటు భాజపా సర్కారు ఉంటుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వచ్చేలా ప్రజలు మద్దతివ్వాలన్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని సూచించారు.’ప్రధాని మోదీపై తెరాస నేతల విమర్శలు చూస్తే బాధగా ఉంది. మోదీని ఎందుకు తిడుతున్నారో తెరాస నేతలు చెప్పాలి. కరోనా టీకాలు ఉచితంగా ఇచ్చినందుకా మోదీని తిట్టాలి? పేదప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నందుకా మోదీని తిట్టాలా ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థులను తీసుకువచ్చినందుకా మోదీని తిట్టాలా రాజకీయ లబ్ది కోసమే మోదీని కేసీఆర్‌ తిడుతున్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణకు కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తోంది. తెలంగాణలో అభివృద్ధి జరగాలని మోదీ పదేపదే చెబుతారు. తెలంగాణ అభివృద్ధికి తెరాస ప్రభుత్వం సహకరించడం లేదు. అందుకే తెలంగాణలో భాజపా ప్రభుత్వం రావాలి. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వచ్చేలా ప్రజలు మద్దతివ్వాలి. కేంద్రంలో మరో 20 ఏళ్ల పాటు భాజపా సర్కారు ఉంటుందని బండి ధీమా వ్యక్తం చేశారు.

Tags :