రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్, ఎన్.టి.ఆర్ స్టార్లుగా కొత్త సినిమా...

Updated:12/03/2018 01:59 AM

new movie acting of ram charan and ntr stars at rajamouli direction

బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడు.. ఎలాంటి సినిమా చేస్తే ఆ అంచనాలను అందుకుంటాడు అన్న విషయాలకు తగినట్టుగా మెగా నందమూరి కాంబినేషన్ లో మెగా మల్టీస్టారర్ కు నాంధి పలికాడు. ఆ సినిమా ఎనౌన్స్ చేయగానే అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఉళిక్కి పడ్డారు.

రాం చరణ్, ఎన్.టి.ఆర్ స్టార్లుగా తమ సినిమాలతో ఫైట్ చేసినా ఒకరికి ఒకరు మంచి స్నేహితులు సన్నిహితులు. అయితే రీసెంట్ గా ఈ సినిమాలో అన్నగా ఎన్.టి.ఆర్, తమ్ముడిగా చరణ్ నటిస్తాడని.. చరణ్ కు కాస్త నెగిటివ్ షేడ్స్ ఉంటాయని అంటున్నారు. అయితే బాహుబలి సినిమాలో రానా విలన్ గా చేశాడు అంటే ప్రభాస్ కన్నా ఇమేజ్ లో రానా తక్కువవాడు కాబట్టి చెల్లింది.

కాని ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు సూపర్ స్టార్లు. ఏ ఒక్కరి పాత్ర మరో పాత్రను డామినేట్ చేసింది అనిపిస్తే ఫ్యాన్స్ కాస్త యాంటీ ఫ్యాన్స్ అవుతారు. ఈ విషయం మీద జక్కన్న కన్ ఫ్యూజన్ లో ఉన్నాడట. అయితే నెగిటివ్ షేడ్ మాత్రం కాని పూర్తిస్థాయి విలన్ కాదు కాబట్టి ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయొచ్చని అనుకుంటున్నాడట.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, సమంత హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారని తెలుస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకుంది అంటే బాహుబలి కలక్షన్స్ ను బీట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ సినిమాను తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కిస్తున్నారట.