యూట్యూబ్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..

Updated:13/05/2018 08:04 AM

new feature in youtube

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన యూట్యూబ్ యాప్‌లో ఓ సరికొత్త ఫీచర్‌ను త్వరలో యూజర్లకు అందుబాటులోకి తేనుంది. 'టేక్ ఎ బ్రేక్' పేరిట యూట్యూబ్‌లో ఆ ఫీచర్ లభించనుంది. సాధారణంగా చాలా మంది యూట్యూబ్ వీడియోలను గంటల తరబడి చూడడంలో నిమగ్నమై ఉంటారన్న విషయం విదితమే. అయితే ఇలా నిరంతరాయంగా వీడియోలను వీక్షించడం వల్ల వాటికి వ్యసనపరులుగా మారి ఆరోగ్యాలను నాశనం చేసుకునే అవకాశం ఉంది. దీంతో అలాంటి ఇబ్బందికి గురి కాకుండా ఉండేందుకు గాను టేక్ ఎ బ్రేక్ ఫీచర్‌ను యూట్యూబ్‌లో అందివ్వనున్నారు. 

యూట్యూబ్‌లో రానున్న ఈ టేక్ ఎ బ్రేక్ ఫీచర్‌ను యాప్‌లోని సెట్టింగ్స్ - జనరల్ - రిమైండ్ మి టేక్ ఎ బ్రేక్ ఆప్షన్‌లోకి వెళ్లి ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో యూజర్ సెట్ చేసుకున్న టైం (15, 30, 60, 90, 180 నిమిషాలు) ప్రకారం ఆ టైం పూర్తయ్యేసరికి యూట్యూబ్ స్క్రీన్‌పై మంకీ బొమ్మ కనిపిస్తుంది. దాంతో వీడియోను చూడడం ఆపి కొంత సమయం పాటు బ్రేక్ తీసుకోవచ్చు. లేదంటే బొమ్మను తీసేసి వీడియోను చూడడం కంటిన్యూ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. తరువాత ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై లభిస్తుంది.

 

సంబంధిత వార్తలు

జియోకు పోటీగా రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

జియోకు పోటీగా రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

వన్ ప్లస్ 6 లుక్ అదిరిపోయింది

వన్ ప్లస్ 6 లుక్ అదిరిపోయింది

మోటోరోలా నుంచి మోటో జడ్3 ప్లే స్మార్ట్‌ఫోన్

మోటోరోలా నుంచి మోటో జడ్3 ప్లే స్మార్ట్‌ఫోన్

హువావే నుంచి వై3 2018 స్మార్ట్‌ఫోన్

హువావే నుంచి వై3 2018 స్మార్ట్‌ఫోన్

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

రెండు నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్

రెండు నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్

వాట్సాప్‌లో మెసేజ్ బాంబులు.. ఓపెన్ చేస్తే అంతే సంగతులు.

వాట్సాప్‌లో మెసేజ్ బాంబులు.. ఓపెన్ చేస్తే అంతే సంగతులు.

ఈ నెల 15న విడుదల కానున్న హానర్ 10 స్మార్ట్‌ఫోన్

ఈ నెల 15న విడుదల కానున్న హానర్ 10 స్మార్ట్‌ఫోన్

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR