హంతక ముఠా అరెస్ట్..

హంతక ముఠా అరెస్ట్..

( అదుపులో సుంకర ప్రసాద్ నాయుడు గ్యాంగ్.. )
అనంతపురం, 24 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో గత కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్ లతో భయాందోళనలకు గురి చేస్తున్న సుంకర ప్రసాద్ నాయుడు ముఠాను ఎట్టకేలకు గుంతకల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్న సుంకర ప్రసాద్ నాయుడు సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.. కాగా గుంతకల్లు మండలం జి. కొట్టాలకు చెందిన కోనంకి వెంకటేష్ ను డబ్బు కోసం ఈనెల 20 వ తేదీన కిడ్నాప్ చేసింది సుంకర ప్రసాద్ నాయుడు ముఠా.. కిడ్నాప్ చేసిన అనంతరం  డోన్ సమీపంలోని ఓబుళాపురంపై మిట్టపై దాచిపెట్టి,  కోటి రూపాయిలు డబ్బు తీసుకురావాలని లేదంటే చంపుతామని బాధిత కుటుంబ సభ్యులను బెదిరించారు.. అయితే ఈ సంఘట గురించిన పక్కా సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ పక్కీరప్ప కాగినెల్లి ఆదేశాలతో, గుంతకల్ డీఎస్పీ యూ. నరసింగప్ప, రూరల్ సీఐ లక్ష్మణ్ లు తమ సిబ్బందితో కలిసి ఓబుళాపురం మిట్టపై దాడిచేసి ముఠాను అరెస్టు చేసి బాధితుడికి విముక్తి కలిగించారు.. ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.. ఈ ఘటనతో పాటు గత నెల 29 న స్వామీజీ ముత్యాల గంగరాజును కిడ్నాప్ చేసి రూ. 24 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేశారని, జిల్లా ఎస్పీ ఫక్కిరప్ప కాగినెల్లి తెలిపారు.. వీరి నుండీ ఒక ఫిస్టోల్, 16 తుటాలు, స్కార్పియో, ఇటీయాస్, బుల్లెట్ వాహనాలతో పాటు రూ. 6.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.. రెండు దశాబ్దాలకు పైగా నేర చరిత్ర ఉన్న సుంకర ప్రసాద్ నాయుడిపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు 11 కేసులు ఉన్నాయని తెలిపారు.. వీటిలో హత్యలు, కిడ్నాప్ లు, బలవంతపు వసూళ్లు, దొంగతనం కేసులు ఉన్నాయి.. గుంతకల్లు మండలం జి. కొట్టాలకు చెందిన మోహన్ నాయుడు ముఠా నాయకుడి యూట్యూబ్ ఇంటర్వూలతో ఆకర్షణకు గురయ్యాడు. అతనిని సంప్రదించి ప్రస్తుతం అరెస్టయిన వారిలో మిగితా వారిని కలుపుకుని ముఠా నేరాల్లో పాలు పంచుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన సుంకర ప్రసాద్ నాయుడి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న గుంతకల్లు డీఎస్పీ బృందాన్ని జిల్లా ఎస్పీ  ఫక్కీరప్ప కాగినెల్లి అభినందించారు. ఇంకా ఎవరైనా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ ముఠా అబారిన పది ఇబ్బంది పడివుంటే తమను సంప్రదించాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు..

Tags :