పార్లమెంట్ ఉభయసభల్లో ఎంపీల ఆందోళన, రేపటికి వాయిదా...

Updated:12/03/2018 02:04 AM

mp discussion at parliament pending forward to tomorrow

పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నాడు వాయిదా పడ్డాయి. సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఉభయ సభల్లో పలు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు తమ రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాలని ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఏపీ రాష్ట్రాన్ని ఆదుకోవాలని టిడిపి ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళన కొనసాగించారు.

పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత టిడిపి ఎంపీలు పార్లమెంట్ వెలుపల ఆందోళన కొనసాగించారు. . ఏపీని ఆదుకోవాలని, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లోనూ ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తర సమయం కొనసాగుతుండగా తెలుగు ఎంపీలు ఫ్లకార్డులతో పొడియం ముందుకు దూసుకు వెళ్లి నిరసన తెలిపారు

దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో రాజ్యసభ కూడా వాయిదా పడింది.

సోమవారం ఉదయం సభా సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే విపక్షాలు నినాదాలతో నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.

ముందుగా ప్రత్యేక హోదాపై స్పందించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కాలింగ్‌ అటెన్షన్‌ నోటీసు ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే సభ్యులు ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తించారు. ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నాం 2గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు.

ఇక లోక్‌సభలోనూ ఇదే తరహా సన్నివేశం చోటు చేసుకుంది. నినాదాలు చేస్తూ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లటంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తెలిపారు.ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడ తమ రాష్ట్రాల్లోని సమస్యలపై పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనకు దిగారు.

సంగీత కళాకారుడిగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిరసన

సంగీత కళాకారుడిగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్ వెలుపల నిరసన వ్యక్తం చేశారు ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంగీతం రాళ్ళను కూడ కరిగిస్తోందని చెబుతారని శివప్రసాద్ గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తన సంగీతం ద్వారా మోడీ మనసును కరిగించాలనే ఉద్దేశ్యంతోనే ప్రయత్నిస్తున్నట్టు శివప్రసాద్ చెప్పారు.

సంబంధిత వార్తలు

టాప్ లెస్ ఫోటోలతో యువతుల నిరసన

టాప్ లెస్ ఫోటోలతో యువతుల నిరసన

అసలేంటీ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’? ఏం చేసింది?: డేటా చౌర్యం

అసలేంటీ ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’? ఏం చేసింది?: డేటా చౌర్యం

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం, వీఆర్ఎస్: రాజకీయాల్లోకి.. ఏ పార్టీ వైపు?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం, వీఆర్ఎస్: రాజకీయాల్లోకి.. ఏ పార్టీ వైపు?

సరికొత్త బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ టెస్ట్ గ్రాండ్ సక్సెస్!

సరికొత్త బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ టెస్ట్ గ్రాండ్ సక్సెస్!

రేపే రాజ్యసభ ఎన్నికలు... దేశ వ్యాప్తంగా 58 సీట్లకు ఓటింగ్

రేపే రాజ్యసభ ఎన్నికలు... దేశ వ్యాప్తంగా 58 సీట్లకు ఓటింగ్

భాజపాకు పరాభవం తప్పదు

భాజపాకు పరాభవం తప్పదు

బ్యాంకులకు మరో ఆభరణాల సంస్థ కుచ్చుటోపీ

బ్యాంకులకు మరో ఆభరణాల సంస్థ కుచ్చుటోపీ

కేసీఆర్‌ కూటమికి పవార్‌ అడ్డు చక్రం!

కేసీఆర్‌ కూటమికి పవార్‌ అడ్డు చక్రం!

Latest Videos

You Tube Image

నటి భానుప్రియ ఇంట విషాదం | Heroine BhanuPriya Husband Passed Away | Adabhyderabad News