త్రిపురలో మంత్రి జోగు రామన్న

Updated:16/04/2018 08:14 AM

minister jogu ramanna visits tripura

రాష్ట్ర మంత్రి జోగు రామన్న త్రిపురలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా త్రిపుర రాజధాని అగర్తల శివారులోని జోగేందుర్ నగర్‌లో ఉన్న త్రిపుర రాష్ట్ర వెదురు పారిశ్రామిక వాడను మంత్రితో పాటు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ సందర్శించారు. మేదర కుల వృత్తిదారులు ఆధునిక విధానాన్ని అనుసరించేందుకు ఈ వెదురు చేతి వృత్తి కళ ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. త్రిపురలో వెదురుతో తయారువుతున్న పలు రకాల ఉత్పత్తులను వాళ్లు పరిశీలించారు.