Friday, April 26, 2024

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

తప్పక చదవండి

జనగామ : జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. అనంతరం సేవాదళ్ రాష్ట్ర కోఆర్డినేటర్ సుంకరి శ్రీనివాస్ రెడ్డి జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బనుక శివరాజ్ యాదవ్ , జనగామ మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ వంగాల కళ్యాణి 9 వ వార్డు ముస్త్యాల చందర్ మోటే శ్రీనివాస్, ఆలేటి సిద్ది రాములు, లింగాల నర్సిరెడ్డి, మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, రచయిత భారతదేశంలోని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతీయవాద ఉద్యమానికి నాయకులుగా మారారు. గాంధీ తన సిద్ధాంతానికి అంతర్జాతీయంగా గౌరవించబడ్డాడు.. రాజకీయ, సామాజిక పురోగతి సాధించడానికి అహింస నిరసననే
( సత్యాగ్రహం ) అని తెలిపారు.. దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురిచ్ఛి జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు నడుంబించాలన్నారు. గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం కోసం పాలకులు కృషి చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సేవాదళ్ జనగామ జిల్లా అధ్యక్షులు పారుపెల్లి ప్రభాకర్ రెడ్డి, జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతీష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల లక్ష్మయ్య, బండారు శ్రీనివాస్, జాయ మల్లేష్, కడారు ప్రవీణ్, బిర్రు సత్యనారాయణ, బోరేల్లి సిద్ధులు, నోముల సోమయ్య, దేవర సత్యనారాయణ, కన్నె బోయిన గూడెం మాజీ సర్పంచ్ లక్ష్మి, మునిబేగం, కుకట్ల సుజాత, పసరమట్ల గ్రామ అధ్యక్షులు దేవులపల్లినారాయణ, ఎనగందుల వెంకటేష్, మచ్చ సందీప్, మోతే జనార్దన్, చడగొండ కృష్ణ రెడ్డి, కళ్యాణ రామస్వామి, యూత్ కాంగ్రెస్ జనగామ జిల్లా కన్వీనర్ ప్రకాష్, రఘు గౌడ్, దూడల నాగరాజు గౌడ్, కొమ్మూరి యువసేన జనగామ మండల అధ్యక్షులు బక్క ప్రవర్దన్, కొమ్మూరి యువసేన జనగామ మండల వైస్ ప్రెసిడెంట్ గాజుల రాజు యాదవ్, అరవింద్ గౌడ్, సి.హెచ్. చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు