భారతీయ ప్రజలకు తక్కువ ధరకే వీసాలివ్వాలి!

Updated:11/03/2018 04:09 AM

low cost of visa for indian people

గత రెండేళ్లుగా యూకేకు భారత పర్యాటకుల తాకిడి తగ్గిపోయింది. మరోవైపు బ్రిటన్‌తో పోలిస్తే పక్కనే ఉన్న ఫ్రాన్స్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఇలా జరగకుండా భారతీయ పర్యాటకులను ఆకట్టుకోవాలంటే వారి వీసా ధరలను తగ్గించాలని సూచిస్తోంది యూకేలోని మేధోవర్గం. ఈ మేరకు రాయల్‌ కామన్‌వెల్త్‌ సొసైటీ(ఆర్‌సీఎస్‌) దీనిపై అధ్యయనం చేసి ఈ విధంగా సూచనలు చేసింది.

ఆర్‌సీఎస్‌ విడుదల చేసిన ‘బ్రిటన్‌ అండ్‌ ఇండియా: బిల్డింగ్‌ ఏ న్యూ వీసా పార్ట్‌నర్‌షిప్‌’ నివేదిక ప్రకారం.. 2016లో భారత్‌ నుంచి 6లక్షల మంది భారత పర్యాటకులు ఫ్రాన్స్‌కు వెళ్లారు. యూకేతో పోలిస్తే ఈ సంఖ్య 1,85,000 ఎక్కువ. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2016లో యూకేలో భారత పర్యాటకుల సంఖ్య 1.73శాతం తగ్గగా.. ఫ్రాన్స్‌లో మాత్రం 5.3శాతం పెరిగింది. అయితే వీసా ధరను తగ్గిస్తే భారత పర్యాటకులను ఆకట్టుకోవచ్చు అని నివేదిక పేర్కొంది.

ఇందుకోసం సరికొత్త యూకే-ఇండియా వీసా ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం.. ప్రస్తుతమున్న రెండేళ్ల వీసా ధరను 388 పౌండ్ల నుంచి 89 పౌండ్లకు తగ్గించాలని నివేదిక సూచించింది. ఇలా చేయడం వల్ల వాణిజ్యపరంగా, పర్యాటక పరంగా దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, అంతేగాక ఇరుదేశాల మధ్య వ్యాపార బంధాలు బలోపేతమవుతాయని మేధోవర్గం అభిప్రాయపడుతోంది.

సంబంధిత వార్తలు

మే  17న విడుదల కానున్న వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్

మే 17న విడుదల కానున్న వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్

హెచ్1బీ వీసాదారులకు షాక్

హెచ్1బీ వీసాదారులకు షాక్

ఫ్లిప్‌కార్ట్‌లో గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్

ఫ్లిప్‌కార్ట్‌లో గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్

ఈ ఎడారి ఉన్నట్టు..ఎవరికీ తెలియదు

ఈ ఎడారి ఉన్నట్టు..ఎవరికీ తెలియదు

ఈ నెల 25న విడుదల కానున్న షియోమీ ఎంఐ 6ఎక్స్

ఈ నెల 25న విడుదల కానున్న షియోమీ ఎంఐ 6ఎక్స్

మృత్యుంజయుడు.. రాత్రి బావిలో ప‌డి తెల్లారేదాకా అందులోనే!

మృత్యుంజయుడు.. రాత్రి బావిలో ప‌డి తెల్లారేదాకా అందులోనే!

రన్‌వేపై జారిన విమానం

రన్‌వేపై జారిన విమానం

పోలీసుల నుంచి తప్పించుకొని బురదలో చిక్కుకున్నాడు.

పోలీసుల నుంచి తప్పించుకొని బురదలో చిక్కుకున్నాడు.

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR