వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం

Updated:21/06/2018 09:55 AM

lok sabha speaker accepts ysrcp mps resignation

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన తరువాత ఐదుగురు ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏప్రిల్ 6న రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. 

మే 29న స్పీకర్ కార్యాలయానికి వెళ్లగా.. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని ఆమె సూచించినప్పటికీ తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని వారు స్పష్టం చేశారు. అధికారులతో సంప్రదింపులు పూర్తయ్యాక వారి రాజీనామాలకు ఆమోద ముద్ర వేసినట్లు లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.